Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శనివారము: 2003 సంవత్సరపు ఎస్ వి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించి వివిధ దేశాల్లో,వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ వైద్య విద్యార్థులందరూ ఈరోజు వారు చదువుకున్న ఎస్వీ వైద్య కళాశాలను సందర్శించి, వివిధ విభాగాల కెళ్ళి వారి వారి క్లాస్ రూంలో ఆనాటి రోజులను తలుచుకొని , మరపురాని రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ వి వైద్య కళాశాలలో చదువుకున్న రోజుల్లో వారి తీపి గుర్తులను, వారికి వైద్య విద్యను నేర్పిన గురువులు గురించి చర్చించుకున్నారు. ఈ ఎస్ వి వైద్య కళాశాల మాకు ఎంతో గుర్తింపు ఇచ్చింది, కావున మేము చదువుకున్న వైద్య కళాశాలకు ఏదైనా ఒక గొప్ప పని చేసి పెట్టాలని ఒక కృత నిశ్చయంతో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పూర్వ వైద్య విద్యార్థులు తెలిపారు. 2003 సంవత్సరపు పూర్వ వైద్య విద్యార్థుల దాదాపు 120 మంది తో అపూర్వ కలయిక జరిగినది. అందులో ఒక ఐ.ఏ.ఎస్ ఒక ఐ.పీ.ఎస్ కూడా ఉన్నారు. డాక్టర్ రూపేష్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ జయచంద్ర భాను,ఐ.ఏ.ఎస్, మరియు డాక్టర్ హేమేంద్రనాథ్ , ఐ.పి.ఎస్, డాక్టర్ భాను, డాక్టర్ రాజేష్, డాక్టర్ రత్నాకర్ రెడ్డి డాక్టర్ స్రవంతి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ జగదీష్, డాక్టర్ సుమ, డాక్టర్ ఆయేషా, డాక్టర్ బిందు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV