Thursday, 30 July 2026 06:24:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Date : 12 July 2026 04:58 PM Views : 471

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : మదనపల్లి రూ. 32.11 లక్షల విలువైన నిషిద్ధ కూల్ లిప్స్, చైనీస్ ఖైనీ, విమల్ ప్యాకెట్లు స్వాధీనం పాఠశాలల వద్ద విక్రయిస్తూ పట్టుబడిన నిందితుడు మదనపల్లె వన్ టౌన్ పోలీసుల మెరుపు దాడి అక్రమంగా విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులను భారీ మొత్తంలో మదనపల్లె వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆదివారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే. రాజారెడ్డి వివరాలను వెల్లడించారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులు పట్టణంలో అక్రమ టొబాకో ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ఆదివారం (జూలై 12) అందిన ముందస్తు నమ్మకమైన సమాచారం మేరకు మదనపల్లె పట్టణం అప్పారావు వీధిలోని 'ఇమ్రాన్ ట్రేడర్స్ లో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు ఈ దాడుల్లో కాల్వగడ్డకు చెందిన నబీఖాన్ అలియాస్ ఇమ్రాన్ (48) అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు అతని వద్ద ఉన్న నిల్వలను పరిశీలించగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండవలసిన స్పష్టమైన పిక్టోరియల్ ఆరోగ్య హెచ్చరికలు లేకుండా అస్పష్టంగా (బ్లర్‌గా) ముద్రించి ఉన్న నిషిద్ధ పొగాకు ఉత్పత్తులు బయటపడ్డాయి మార్కెట్లో సుమారు రూ. 32,11,384/- విలువ చేసే మొత్తం 26,760 కూల్ లిప్స్, చైనీస్ ఖైనీ, విమల్ బ్రాండ్ల పొగాకు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు నబీఖాన్ ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద ఉన్న చిన్న చిన్న దుకాణాలకు ఈ మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ, పాఠశాల విద్యార్థులకు, యువతకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది దీంతో నిందితుడిపై సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 లోని సెక్షన్ 7, 8 ఆర్/డబ్ల్యూ 20 తో పాటు, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజా రెడ్డి తెలిపారు ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అక్రమ మత్తు పదార్థాల విక్రయదారులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: