Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని శెట్టిపేట గ్రామ పంచాయతీ, తోటకురప్పల్లి గ్రామం సమీపంలో ఆంజినేయుని గుండు సమీపంలో కొత్తపల్లికి చెందిన ఒక రైతు మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ట్రాక్టర్ లోడ్డు నాలుగు వందలా యాబై లెక్కన చేనుకు సుమారు రెండువందల లోడ్లు ఎర్రమట్టిని తోలుకోవడం జరిగింది.ఈ విషయం పైన ఉదయం పదకొండు గంటల సమయంలో గ్రామ రెవిన్యూ అధికారి రెడ్డెప్ప కు విషయం గ్రామస్తులు తెలియజేయగా, వెంటనే నిలుపుదల చేస్తామని చెప్పారని .ఐతే సాయంత్రంవరకు ఎర్రమట్టి తోలడం తో వారు సదరు విషయం రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయం లో రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం నిండుగా ఉఝడటంతో భారీగా చేతులు మారినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.శెట్టిపేట గ్రామ పంచాయతీ లో అడ్డగుట్ట ప్రాంతంలో ఈ విధముగా సుమారు రెండు ఎకరాల వరకు కొండను సైతం తవ్వి ఎర్రమట్టిని తోలుకోవడం పై పలు విమర్శలు వస్తున్నాయి.ఈ మట్టి మాఫియా గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతుందని,ట్రాక్టర్లతో మట్టి తోలుతున్నప్పుడు మార్గమద్యంలో గల ఇండ్లలో దుమ్ముదూళి నిండిపోతుందని, ఈ విషయం పైన ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని గ్రామస్తులు వాపోయారు. అంతే కాకుండా ఎవరైనా పత్రికా న్యూస్ రిపోర్టర్లు వెళ్ళి ఫోటోలు, విడియోలు తీసుకొని వస్తే వెంటనే రాజకీయ నాయకుల నుండి సదరు రిపోర్టర్లకు ఫోన్లు వెళ్తున్నాయి.వార్తాకథనాలు రాయవద్దని, న్యూస్ రిపోర్టర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పుకార్లు చేస్తున్నారు. వీళ్ళ పుకార్లకు భయపడి న్యూస్ రిపోర్టర్లు ముందుకు రావడం లేదు. అంటే పత్రికా స్వేచ్చ అంటే కూడా తెలియని నాయకులున్నారని ఇట్టే అర్థమౌతుంది.అంటే ఈ సంఘటన ఆధారంగా వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉందో కావున వెంటనే అధికారులు చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.
Admin
Famous TV