Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసులలో ముద్దాయిని చాకచక్యంగా పట్టుకుని చేధించిన పోలీసులు.ముద్దాయి పై PD ACT కేసును నమోదు చేసి, పరివర్తన చెందించే ప్రయత్నం చేస్తాము. జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., శనివారం నాడు జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పి గారు అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్ గురించి వివరాలను వెల్లడించారు. అరెస్ట్ అయిన ముద్దాయి వివరాలు: బోడబతుల శ్రీను @ సకల శ్రీను @ నల్ల శ్రీను, వయస్సు 34 సం//లు, తండ్రి పేరు బి. రమణ, స్వగ్రామము రెల్లి వీది, సీతం పేట, పాత TB హాస్పిటల్, విశాఖపట్నం జిల్లా. ప్రస్తుత నివాసం D.No. 6-205, వెంకటేశ్వర కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, మంగళం, తిరుపతి రూరల్. అరెస్ట్ తేది & స్థలం: 02-06-2023 తేదిన సుమారు 3.00 PM గంటలకు తిమ్మినాయుడు పాలెం బస్ స్టాప్, కరకంబాడి రోడ్, తిరుపతి.అరెస్ట్ తేది & స్థలం: 02-06-2023 తేదిన సుమారు 3.00 PM గంటలకు తిమ్మినాయుడు పాలెం బస్ స్టాప్, కరకంబాడి రోడ్, తిరుపతి. వస్తు స్వాదీనం వివరాలు: 793 గ్రాముల బంగారు ఆభరణములు మరియు 1235 గ్రాములు గల వెండి వస్తువులు స్వాధీనం, వాటి విలువ సుమారు Rs.40,00,000/- (40 Lakhs). కేసు వివరాలు :
నిన్నటి రోజు 02-06-2023 వ తేదీన సాయంత్రము 3.00 PM గంటలకు జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి ఆద్వర్యములో అలిపిరి సిఐ అబ్బన్న వారికి వచ్చిన సమాచారము మేరకు ఎస్ఐ చిన్న రెడ్డప్ప వారి సిబ్బంది కలిసి తిమ్మినాయుడు పాలెం బస్ స్టాప్ వద్దకు వెళ్లగా అక్కడ ఒక వ్యక్తి నిలబడి వుండి పోలీసు వారిని చూసి మంగళం వైపు పరిగెత్తుకుంటూ పారిపోవుటకు ప్రయత్నించడం జరిగిందన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా చుట్టుముట్టి అతనిని పట్టుకొని, అదుపులోకి తీసుకోని విచారించగా, అతను చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యముతో తిరుపతి నగరం లోని పలు ప్రాంతాలలో తాళము వేసిఉన్న ఇళ్ళ దగ్గర పగటి పూట రెక్కి నిర్వహించి, రాత్రి పూట ఇంటి తాళమును పగుల కొట్టి, లోపలికి ప్రవేశించి, సదరు ఇళ్ళల్లో వున్న బంగారు ఆభరణములను & వెండి వస్తువులను దొంగిలించి, సదరు బంగారు ఆభరణములు గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి, సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసినదన్నారు. సదరు వ్యక్తిని నిన్నదినం అలిపిరి సిఐ అబ్బన్న అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మొత్తం సుమారు 793 గ్రాములు బంగారు ఆభరణములు మరియు సుమారు 1235 గ్రాముల గల వెండి వస్తువులు స్వాధీనము చేసుకోవడమైనది. సదరు వ్యక్తి దొంగిలించిన బంగారు ఆభరణముల గురించి ఇప్పటికే అలిపిరి పోలీస్ స్టేషన్ లో 9 కేసులు నమోదు అయినవి అని తెలిపారు. ఇతను పాత నేరస్థుడు, 2010 సంవత్సరం నుండి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. ఈ ముద్దయిపై గతంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ సిటి, తిరుపతి CCS, తిరుచానూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో సుమారు 35 కు పైగా దొంగతనాలు చేసిన కేసులలో జైలుకు వెళ్లి శిక్ష కూడా అనుభవించినట్లుగా తెలిసినది. కావున సదరు ముద్దాయి పై PD ACT కేసును కూడా నమోదు చేసి, అతనిని పరివర్తన చెందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇందులో ముద్దాయిను పట్టుకొనుటకు సహకరించిన అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు & సిబ్బంది సిఐ అబ్బన్న, ఎస్ఐలు జయచంద్ర, ఇమ్రాన్ బాష, చిన్న రెడ్డప్ప, హెడ్ కానిస్టేబుల్ రవి రెడ్డి, కానిస్టేబుల్ లు ప్రసాద్, చంద్ర శేఖర్, స్వయం ప్రకాష్, షణ్ముఖరావు వారిని జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు అభినందించి, రివార్డుతో పాటు ప్రశంగా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు వెంకటరావు పరిపాలన, తిరుపతి డిఎస్పి సురేంద్ర రెడ్డి, అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ అబ్బన్న, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV