Thursday, 30 July 2026 11:29:20 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పోలీస్‌ నకిలీ ఐడీ కార్డుతో.. ముగ్గురి వ్యక్తులతో ప్రేమాయణం

Date : 15 June 2023 05:39 PM Views : 402

Famous TV - క్రైమ్ వార్తలు / Hyderabad : హైదరాబాద్: పోలీస్‌ కానిస్టేబుల్‌ అంటూ ఏకంగా నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం కేంద్రంగా ఓ యువతి అనేక మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసింది. అంతేకాకుండా ముగ్గురిని ప్రేమించి పెళ్లి చేసుకుని వారితో బలవంతంగా చోరీలు చేయిస్తోంది. ఈ మాయలేడీని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లంగర్‌హౌస్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్‌లో నివాసం ఉండే అశ్విని ఇంటర్‌ వరకు చదువుకుంది. జల్సాలకు అలవాటు పడిన ఈ యువతి తన పేరును అశ్వినిరెడ్డిగా మార్చుకోని తాను హైదరాబాద్‌ పరిధిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు ఫేక్‌ ఐడీ కార్డును తయారు చేసింది. అనంతరం ఈసీఐఎల్‌లో నివాసముండే రోహిత్‌కిషోర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. నాలుగేళ్ల తర్వాత మరో యువకుడు రోహిత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొదటి భర్తను చంపాలని ప్రయత్నం చేసింది. డబ్బుల కోసం ఈ ఇద్దరినీ చోరీలు చేయాల్సిందిగా బలవంతపెట్టసాగింది. ఈ క్రమంలో చోరీలకు పాల్పడి రోహిత్‌ జైలు పాలయ్యాడు. ప్రస్తుతం అశ్విని మెహిదీపట్నంలో నివా సం ఉంటూ అభిషేక్‌తో సహజీవనం కొనసాగింది. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం కేంద్రంగా.. పోలీసు నకిలీ ఐడీ కార్డును తయారు చేయించిన అశ్విని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అనేక మంది వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసింది. దీనికి రాపిడో ఎంచుకోని ఆ వాహనంపై ప్రయాణిస్తూ యువకులను వలలో వేసుకుంది. వారి వాహనంపై బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం వద్దకు వెళ్లేది అక్కడ ఆ యువకులను బయట ఉంచి లోపలికి వెళ్లేది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి పని పూర్తయియిందని లేదా సార్‌ బయటకు వెళ్లాడని చెబుతూ వచ్చేది. ఒక్కొక్కరికి వద్ద వేలాది రూపాయలు వసూలు చేసిన ఈ కిలేడీ చివరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కింది. తనకు పెళ్లి కాలేదని అశ్విని మోసం చేసిందంటూ అభిషేక్‌ కొద్ది రోజుల క్రితం పోలీసుల సమక్షంలో చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనతో ఉండట్లేదు అంటూ అశ్విని అతనిపై ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: