Thursday, 11 June 2026 10:57:12 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది

Date : 18 February 2026 09:11 PM Views : 938

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూ నియోజకవర్గం చౌడేపల్లి : బంగారు కడ్డీలు ఆశచూపి పదిహేను లక్షలతో ఉడాయించిన ఘటన చౌడేపల్లి మండలం, లద్దిగం కు కూతవేట దూరంలో జరిగినది. బాదితుని కథనం మేరకు కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ జిల్లా, సాగర్ టౌన్ నందు విజయ్ కుమారుడు రాజేష్(35) తన ఇంటి చుట్టుపక్కల ఒక జేసిబి పనిచేస్తున్న నేపత్యంలో జేసిబి డ్రైవర్ ఆమాటా ఈమాట కలిపి మాట్లాడుతూ తన వద్ద 35 కేజిల బంగారు ఉందని, నేను జేసిబి పనిచేస్తుండగా దొరికినదని, దానిని ఎళరికైనా అమ్మాలని చూస్తున్నాని రాజేష్ తో నమ్మబలికాడు. రాజేషత అది ఒరిజినల్ బంగారు ఔనా కాదా అని సందేహించగా అతను ఒక బంగారు కడ్డీ రాజేష్ కు ఇచ్చి కావాలంటే తనిఖీ చేసుకోవాలని హితవు పలికాడు.సదరు కడ్డీని రాజేష్ తనిఖీ చేసుకోగా అది ఒరిజినల్ అని నిర్దారణ చేసుకొని, తన వద్దగల సొమ్మును పోగుచేసుకొని, తన ఇంటి పత్రాలను సైతం తనఖా పెట్టి పదిహేను లక్షలు డబ్బును సిద్దం చేసూకున్నాడు. ఐతే కథ శివమొగ్గ నుండి ఆంద్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా, మదనపల్లి టౌన్ కు చేరినది. అక్కడకు రావాలని వారు సూచించడంతో రాజేష్ ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలియజేసి వాళ్ళను తన వెంట బెట్టుకొని వచ్చాడు. ఐతే మదనపల్లి ప్రాంతం సరైనది కాదని, అక్కడి నుండి చౌడేపల్లి మండలం,లద్దిగం కు గొల్లపల్లి కి మద్యలో గల చింతతోపులో కలిసే విధంగా ప్లాన్ చేసుకొని మద్యాహ్నం సమయం లో కలసుకున్నారు. రాజేష్ తను బాడగకు కారు మాట్లాడుకొని వచ్చాడు. బగారం కడ్డీలు తెచ్చేవ్యక్తి ద్విచక్ర వాహనంలో వచ్చి ఒక సంచిలో రెండుకేజిల రాయిని గుడ్డలో కట్టినది ఒక సంచి, మట్టిని మూడు కేజీలు గుడ్డలో కట్టిన సంచి ఒకటి అంటే మొత్తం రెండు సంచులు తెచ్చి రాజేష్ కు ఇచ్చి వెంటనే నగదు తీసుకొని పుంగనూరు పోలీసులు వెంబడిస్తున్నారని చింతతోపులో నుండి గొల్లపల్లికి కాలిబాట గల దారిగుండా ద్విచక్ర వాహనంలో పారిపోయాడని బాదితుడు చెప్పాడు. వెంటనే అతను తనకు ఇచ్చిన రెండు సంచులు విప్పి చూడగా ఒక సంచిలో సుమారు రెండుకేజీల రాయి, ఇంకో సంచిలో గుడ్డలో కట్టిన మూడు కేజీల మట్టిని చూసి నేను మోసపోయానని తెలుసుకొని పుంగనూరు పోలీస్టేషన్ క వెళ్ళి పిర్యాదు చేయగా డబ్బులు లావాదేవీలు జరిగిన ప్రదేశం చౌడేపల్లి పరిధిలోనికి వస్తుందని చౌడేపల్లికి వెళ్ళమన్నారు. రాజేష్ చౌడేపల్లికి వెళ్ళి పిర్యాదు చేయగా సదరు అధికారులు బందిబస్తులో ఉన్నారని, అధికారుల దృష్టికి అక్కడ గల సిబ్బంది తీసుకొని వెళ్ళారు. అధికారులు వచ్చిన తర్వాత వచ్చి కలవమని చెప్పినట్లు తెలియజేశారు. అంతే కాకుండా ఈ మోసం ప్రారంభమైనది శివమొగ్గలో కాబట్టి అక్కడ పిర్యాదు చేస్తే బాగుంటుందని అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :