Friday, 12 June 2026 12:22:49 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

నామిని కి మాండలిక బ్రాహ్మ అవార్డు ప్రదానం

Date : 17 March 2024 04:33 PM Views : 663

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, మార్చి 17: అమర రాజ సంస్థ తరపున రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సభలో ప్రముఖ పాత్రికేయుడు, కథా రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ను మాండలిక బ్రాహ్మ అవార్డు తో సత్కరించారు. ఈ సమావేశం లో విశిష్ట అతిథి, తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ…. నామిని మాకు మార్గదర్శి. ఆయనను అనుసరించడం కష్టం.మహారచయిత, నామిని సరసన కూచోవడం అదృష్టం. తెలుగు వచన రచన ను శాసించాడు. నామిని ఊహాశక్తి గొప్పది అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు తాడి ప్రకాష్ మాట్లాడుతూ… రచయితలు అందరికీ అభిమానులు ఉంటారు. నామిని కి మాత్రమే ఆత్మాహుతి దళాలు ఉంటాయని అన్నారు.. కాళోజీ అభినందనలు అందుకున్నాడు. బాపు మెప్పు పొందాడు. పతంజలి ప్రోత్సాహం తో పచ్చనాకు సాక్షిగా రాయించారు. అందులో ప్రతి వాక్యం చదువుకున్నాం.అప్పటికి పేరున్న గొప్ప రచయితల్ని బయటికి పంపిన వాడు అన్నారు. ప్రజా గాయకుడు పెంచల దాసు మాట్లాడుతూ… అమ్మగురించి గొప్పగా రాసిన వాడు నామిని. ఆయన రాసిన మాండలిక భాష మాకు ప్రేరణగా ఉండేది. ఆయన ఉన్న కాలం లో ఉండడం మన అదృష్టం అన్నారు. సభకు అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ… అక్షరానికి పట్టాభిషేకం జరుగుతున్న రోజు, మాండలిక బ్రంహోత్సవం. రాజగోపాల్ నాయుడు ఎంతో అనుభందం ఉంది. రాజకీయ, సాహిత్య, సేవా రంగాలలో అవిశ్రాంతంగా పనిచేశారు. ఇక నామిని ఈ పురస్కారం ఇవ్వడం మన అదృష్టం అన్నారు. చివరగా రాజన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గల్లా రామ చంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారి, డాక్టర్ గౌరినేని రమాదేవి తదితరులు నామిని దంపతులను మాండలిక బ్రాహ్మ అవార్డు తో స్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు. చివరగా నామిని మాట్లాడుతూ.. ఈ బిరుదు నా కంటే ముందు తరం రచయితలు గురజాడ, చలం, చాసో, కేశవ రెడ్డి, వంటి ఎందరో ప్రముఖ రచయితలకు చెందుతుంది. అన్నారు తొలుత బొందు రామచంద్ర రెడ్డి ఉద్దీపన గీతం తో సభ ప్రారంభం అయ్యింది. డాక్టర్ సాకాం నాగరాజ స్వాగతం పలికారు. సబ్ రిజిస్ట్రార్ కొండారెడ్డి, జీ. కె.యస్. రాజ ప్రసంగించారు. ఈ కార్య క్రమం లో నామిని కుటుంబ సభ్యులు, అరసం తిరుపతి జిల్లా ప్రతినిధులు యువశ్రీ మురళి, నేమిలేటి కిట్టన్న, వాకా ప్రసాద్, వేమూరి జయరాం ప్రసాద్, పురందర నాయుడు, గొర్రెపాటి రమేష్, పేరూరు బాల సుబ్రమణ్యం, పలువురు సాహితీ ప్రియులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :