Famous TV - ఆంధ్రప్రదేశ్ / : గత మూడు రోజులుగా జరిగిన 23వ ఇంటర్ కాలిగేట్ ఉమెన్స్, గేమ్స్ మీట్ 2023, డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ వారి ఆదేశాలతో, జి.ఎస్.ఎల్. వైద్య కళాశాల రాజమండ్రి వారి ఆధ్వర్యంలో మహిళ ( ఉమెన్స్ ) క్రీడలు నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 25 వైద్య కళాశాల లోని వైద్య మహిళ విద్యార్థులు వివిధ క్రీడలలో పాల్గొన్నారు. ఎస్వీ వైద్య కళాశాల నుండి చదరంగ పోటీలో మూడో స్థానం సాధించారు. అందులో పాల్గొన్న వైద్య విద్యార్థినిలు 2023 వ సంవత్సరపు మొదటి సంవత్సర వైద్య విద్యార్థులు జాహ్నవి, చందన, ఖుషి టాకూర్, అంజలి రాజేష్, మరియు గాయత్రి, లకు కప్పు మరియు కాంస్య పథకాలు తో సత్కరించారు. క్రీడల్లో ఎస్ వి వైద్య కళాశాల వైద్య విద్యార్థినిలు ఉమెన్స్ గేమ్స్ మీట్లో కప్పు, మరియు మెడల్స్ సాధించిన వారికి, ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ , వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ వెంకటేశ్వరులు, డాక్టర్ సునీత, ఎస్వీ వైద్య కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శరవణ, వైద్య విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV