Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్., గారు సిబ్బంది వెల్ఫేర్ విషయంలో ఎప్పుడు ముందుంటారు ఇదే క్రమంలో విధి నిర్వహణ చేస్తూ అలాగే అనారోగ్యం పాలైన హోంగార్డ్స్ కి ఆర్థిక సహాయాన్ని అందించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా నందు విధులు నిర్వహిస్తున్న 14 మంది హోంగార్డ్స్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వారికి వెల్ఫేర్ ఫండ్ నుండి ఒక్కొక్కరికి 4999/- రూపాయలు (మొత్తం 69,986/-Rs) చొప్పున ఆర్థిక సహాయం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందించడం జరిగింది..
ఆపద సమయంలో ఆదుకొని తమ వెన్నుండి నడిచిన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.ఎస్., గారికి హోంగార్డ్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందుకు సహకరించిన హోంగార్డ్స్ డిఎస్పీ లక్ష్మణ్ కుమార్ గారికి మరియు అర్.ఐ శ్రీనివాసులు గారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ శ్రీ వెంకటరావు, L&O కులశేఖర్, హోంగార్డ్స్ డిఎస్పీ లక్ష్మణ్ కుమార్ గారికి మరియు అర్.ఐ శ్రీనివాసులు, హోంగార్డ్స్ ఇంచార్జి ప్రేమనాద్, రైటర్ శరత్ కుమార్, వెల్ఫర్ డ్యూటీస్ చార్లెస్ బాబు పాల్గొన్నారు .
Admin
Famous TV