Thursday, 30 July 2026 10:32:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్ వి వైద్య కళాశాల వైద్య పరిశోధనలో ముందడుగు

Date : 24 July 2023 05:27 PM Views : 561

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : సోమవారము విలేకరుల సమావేశంలో వైద్య పరిశోధనల మీద ఎస్ వి వైద్య కళాశాల ముందడుగు. అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పరిశోధనలు జరుగుతున్నవి. కేంద్ర ప్రభుత్వం (ఐ.సి.ఎం.ఆర్.) న్యూ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఎస్వీ వైద్య కళాశాల లో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ (ఎం ఆర్ హెచ్ ఆర్ యు ) చంద్రగిరి, మరియు మల్టీ డిస్ప్లేనరీ రీసెర్చ్ యూనిట్ (ఎం.ఆర్. యు ) అను రెండు పరిశోధన యూనిట్లు దిగ్విజయముగా నిర్వహించబడుతున్నది. వైద్య పరిశోధనలో ఇప్పటివరకు 42 పరిశోధనా పత్రాలు ప్రారంభించగా, 18 పరిశోధనలు పబ్లిష్ కావడం జరిగినవి. ఇక 24 పరిశోధనలు జరుగుతున్నవి. ఇప్పటివరకు ఐదు నేషనల్ వర్క్ షాప్స్ చేయడం జరిగినది. ఈ విధంగా 125 మంది రీసెర్చ్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. 14 రీసెర్చ్ పత్రాలు ముద్రించడం జరిగినది. యు జి, పీజీ,వైద్య విద్యార్థులకు వైద్య పరిశోధన మీద దృష్టి సారించడం జరిగినది. 60 మంది పీజీ వైద్య విద్యార్థులు నిరంతరం వైద్య పరిశోధనలు జరుగుతున్నది. ఇలాంటి పరిశోధన వలన మెరుగైన వైద్యం అందించడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా ఎం ఆర్ యు నోడల్ అధికారి డాక్టర్ ఏ.ఎస్. కిరీటి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వీ వైద్య కళాశాలకు అనుసంధానంగా ఉన్న (ఎంఆర్ హెచ్ ఆర్ యు ) చంద్రగిరి లో గ్రామీణ ఆరోగ్య పరిశోధనా కేంద్రంలో , ఇప్పటివరకు గ్రామీణ వైద్యం మీద పరిశోధనలు జరగడం అందులో ఈ ఎంఆర్ హెచ్ ఆర్ యు దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం చాలా గర్వకారణం అని నోడల్ అధికారి డాక్టర్ సునీత, ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను పరీక్షించి, వాతావరణంలో కలుగుతున్న మార్పులకు అనుగుణంగా వస్తున్న జబ్బులను ఏ విధంగా పరిశోధించవచ్చునో అందుకు కావలసిన డేటా మొత్తం సేకరించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఇలాంటి పరిశోధనల వలన ఊబకాయము, క్షయ వ్యాధి , కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులను మనం ముందుగానే గ్రహించి మెరుగైన వైద్యం అందించగలమని తెలిపారు. కౌమార దిశలో ఉన్న ఆడపిల్లలకు కలుగుతున్న ఇబ్బందులను, తెలుసుకొని వారికి అవగాహన కార్యక్రమాలను ప్రాథమిక చికిత్సలను అందించడం జరుగుతున్నది. ఎస్ వి వైద్య కళాశాల ఎక్కడలేని విధముగా సోషల్ సైన్స్ విశ్వవిద్యాలయాలతో, శ్రీ పద్మావతి మహిళ, విశ్వవిద్యాలయం తిరుపతి, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి తో పరిశోధనల మీద పరస్పర ఒప్పంద పత్రాలు చేసుకోవడం జరిగినది. దీనివలన వైద్య విద్యార్థులు, మరియు సోషల్ సైన్స్, వెటర్నరీ విద్యార్థులకు , పరిశోధనల మీద అవగాహన పెంపొందించడానికి వీలు కలుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ యు సైంటిస్ట్ డాక్టర్ మధుసూదన్, డాక్టర్ సునీత న్యూట్రిషన్స్ట్, పిల్లల విభాగం, ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: