Famous TV - ఆరోగ్యము / తిరుపతి : బుధవారము మిషన్ స్మైల్ సంస్థ ఆధ్వర్యంలో రుయా ఆస్పత్రి నందు ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీషియా విభాగం వారి సహకారం తో, గ్రహణం మొర్రి సర్జరీలు 13 వ తారీఖు నుండి 17 వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రహణం మొర్రితో బాధపడుతున్నవారు, వారి బంధువర్గం, వారికి తెలిసినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవలసినదిగా రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు తెలిపారు. ఈ ఆవకాశాని సద్వినియోగం చేసుకోవలసినదిగా ప్రజలను కోరినారు. సదరు క్యాంపునకు ముఖ్యంగా తెలంగాణ, బెంగుళూరు, కృష్ణగిరి నుండి ప్రసిద్ధిగాంచిన ప్రముఖ వైద్యుల సహకారంతో ఈ సర్జరీలు నిర్వహించబడును. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మెరుగైన వైద్యం పొందగలరు. ఈ క్యాంపులో సర్జరీ చేసుకున్న వారికి, జగన్ అన్న ఆసరా పదకం ద్వారా లబ్ది కూడా చేకూరుతుంది. ఈ కార్యక్రమానికి ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు (పరిపాలన ), అనస్తీశాలజీ విభాగాధిపతి డాక్టర్ రాధా , ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి, అనస్థీషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్ సూపరిటెండెంట్ అరుణమ్మ, వైద్యులు పిజి వైద్య విద్యార్థులు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.రుయా ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.మొదటిరోజు స్క్రీనింగ్ టెస్ట్ లో గ్రహణ మొర్రి తో బాధపడుతున్న 30 మంది పిల్లలను సర్జరీ కొరకు ఎంపిక చేసినట్లు సర్జరీ స్పెషలిస్టులు తెలిపినారు.రుయా ఆసుపత్రిలో ప్రతి బుధ శనివారాలలో ప్లాస్టిక్ సర్జరీ విభాగము నందు గ్రహణ మొర్రి సర్జరీలు నిర్వహించబడునని ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రహణ మొర్రి తో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలిపారు.
Admin
Famous TV