Thursday, 30 July 2026 09:45:43 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రపంచ మెదడు దినోత్సవ అవగాహన కార్యక్రమం

Date : 22 July 2023 04:42 PM Views : 514

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శనివారం ఉదయం 11 గంటలకు రుయా ఆసుపత్రి జీరియా ట్రిక్ వార్డ్ నందు రోగులను ఉద్దేశించి ప్రపంచ మెదడు దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మెదడును ఎల్లవేళలా చాలా జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ ), డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారి సూచనల మేరకు ఈరోజు మన ఈ ప్రపంచ మెదడు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. వయోవృద్ధుల వార్డు నందు నరాల వ్యాధిగ్రస్తులు , మూర్చతో బాధపడుతున్న రోగులకు వారి అటెండలకు , వైద్య విద్యార్థులకు మరియు నర్సింగ్ పారామెడికల్ విద్యార్థులకు అవగాహన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెదడు లో కలిగే రోగాలను ఏ విధంగా అరికట్టాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరాలజీ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.రాజేశ్వరి క్లుప్తంగా విసదీకరించి, అందరికీ అవగాహన కలిగించారు. మన శరీరంలో కలుగుతున్న మార్పులు, ఎప్పటికప్పుడు మెదడుకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన మెదడును చాలా జాగ్రత్తగా చూసుకుని, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకొని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించినట్లయితే వెంటనే మెరుగైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుంది. క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను , మూర్చ వ్యాధిగ్రస్తులను, చిన్న భారీ వాహనాలు నడుపుతున్న వారు హెల్మెట్లు ధరించి, సీట్ బెల్ట్ ధరించి వాహనములు నడపవలెను. అప్పుడే మన తలకు ఎలాంటి గాయం కలగకుండా మెదడును కాపాడుకోవడం జరుగుతుంది. జాతీయ రహదారులు నందు జరుగుతున్న విపత్తుల వలన మన మెదడుకు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన ప్రాథమిక సూచనలను తప్పకుండా పాటించవలెను. అప్పుడే మెదడును మనం కాపాడుకోవడం సులభతరం అవుతుందని అన్నారూ. మెదడుకు సంబంధించిన వ్యాధుల నుండి రోగులను కాపాడుకోవడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి మంగళవారము మరియు శుక్రవారం రోజు రుయా ఆసుపత్రి ఒపీ విభాగము నందు మెదడుకు సంబంధించిన రోగులను పరీక్షించబడును కావున పురప్రజలందరూ ఈ ఉచిత న్యూరాలజీ విభాగ వైద్య సేవలను అందిపుచ్చుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో రుయా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్ ), డాక్టర్ వసుంధర దేవి, వివిధ విభాగాల పీజీ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ అండ్ ఫిజియోథెర విద్యార్థిని విద్యార్థులు మరియు పారామెడికల్ విద్యార్థిని విద్యార్థు లు, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: