Famous TV - ఆరోగ్యము / : బెంగళూరు యలహంకా న్యూ టౌన్ అంబెడ్కర్ భవనలో ఏర్పాటు చేసిన తొమ్మిదవ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలాహంకా సాతిల్లిటి సిటీ ఎమ్మెల్యే విశ్వనాథ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపుగా 1500స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ చేసిన ఈ కార్యక్రమంలో యోగా శిక్షకురాలు డాక్టర్ మాధవి చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగాసనాలపై ప్రత్యేక శిక్షనిచ్చి సూపర్ సక్సెస్ చేశారని కొనియాడారు.
శిక్షకురాలు మాధవి చౌదరి మాట్లాడుతూ నాకు తెలిసిన యోగా విద్యను నలుగురికి నేర్పిస్తూ..పిల్లలు నుంచి వృద్ధుల వరకు వారి వారి వయస్సులను బట్టి వివిధ రకాల శిక్షనిస్తూ నా ప్రయాణం కొనసాగిస్తున్నానని..నా శిక్షణ కార్యక్రమాలను చూసి ముఖ్యుల నుంచి ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను పొందానని..అంతేకాకుండా నా శిక్షణ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్న పాత్రికేయులకు కృతజ్ఞతలన్నారు.ఈ కార్యక్రమంలో పరిపూర్ణ యోగా కేంద్రం ప్రతినిధులు రక్షిత,మనోహర్,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV