Friday, 12 June 2026 01:47:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

50 రైళ్లు రద్దు

కొన్ని దారి మళ్లింపు

Date : 04 June 2023 03:25 PM Views : 367

Famous TV - జాతీయ వార్తలు / : ఒడిశాలో రైలు ప్రమాదం జరగడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు దాదాపు 50 రైళ్లను రద్దు చేశారు. మరో 38 రైళ్లను దారి మళ్లించారు. హౌరా–బెంగళూరు, హౌరా–చెన్నై, హౌరా–తిరుపతి, హోరా–సికింద్రాబాద్, హోరా–హైదరాబాద్ రైళ్లు రద్దు అయ్యాయి. సికింద్రాబాద్–షాలిమార్, వాస్కోడిగామా–షాలిమార్ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–హౌరా ట్రైన్‌‌‌‌‌‌‌‌ను జరోలి మీదుగా, బెంగళూరు–గువాహటి రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా నడుపుతున్నారు. హౌరా–పూరీ, హౌరా–బెంగళూరు, హౌరా–చెన్నై మెయిల్, హౌరా–సంబల్‌‌‌‌‌‌‌‌పూర్, సంత్రగాచి–పూరీ, కన్యాకుమారి–హోరా రైళ్లను రద్దు చేశారు. అలాగే..హౌరా–పూరీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, హౌరా–సర్‌‌‌‌‌‌‌‌ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌–హౌరా జన్‌‌‌‌‌‌‌‌శతాబ్ది ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, హౌరా–భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ జన్​ శతాబ్ది ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్, పూరీ–హౌరా శతాబ్ది ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, పూరీ–షాలిమార్‌‌‌‌‌‌‌‌ధౌలీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌, పూరి–బంగిరిపోసి, బంగిరిపోసి-పూరి ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌లు రద్దు అయ్యాయి. బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు బాధిత ప్రయాణికుల కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే వివిధ జంక్షన్లలో హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ–0866 2576924, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 040 27788516 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసి బాధితుల సమాచారాన్ని అందిస్తున్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :