Famous TV - జాతీయ వార్తలు / : వారం రోజుల క్రితం వివిద అంశాలపై అధ్యయనానికి 10 మంది బృందంతో బ్రెజిల్ వెళ్లిన పార్లమెంటరీ కమిటీ అట్నుంచి అటు ఉరుగ్వే చేరుకొన్నారు. ఈ సందర్బంగా పార్లమెంటరీ కమిటీకి ఉరుగ్వేలో ఘనస్వాగతం లభించింది. అనంతరం జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు పెంపొందించే దిశగా చర్చలు సాగాయాని తెలియజేసారు. యుఎన్ఓ లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఈ చర్చలలో ఆ దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, స్పీకర్ మరియు తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారని ప్రభుత్వం తరపున తమ ప్రతిపాదనలను స్వాగతించారని ఈ ఏడాది నవంబర్లో ఉరుగ్వే పార్లమెంట్ ప్రతినిధులు భారత్ లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలియజేసారు. అలాగే ఉరుగ్వేలో వ్యాపార అవకాశాలకి సంబదించి జరిగిన సమావేశంలో ఉరుగ్వేలో పెట్టుబడుల వలన ఎలాంటి ఉపయోగాలుంటాయి, రాబడి ఎలా ఉంటుంది అని పలు అంశాలపై వివరించారని చెప్పారు. భారతదేశంలో పెరుగుతున్న ఫర్నిచర్ ఇండస్ట్రీ డిమాండ్ కి అనుగుణంగా కొయ్య (వుడ్) ఎగుమతి చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసారని తెలియజేసారు.
ఉరుగ్వే ముప్పై లక్షల జనాభా కలిగిన దేశమని ఆ దేశ ప్రజలు కాని రాజకీయ నాయకులు కాని దేశ అధ్యక్ష హోదాలో ఉన్న వారు కాని ప్రతి ఒక్కరూ చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని చాలా ప్రశాంతమైన దేశమని క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉందని అక్ష్యరాస్యత 97%గా ఉందని అన్నారు. ఉరుగ్వేలో అతిపెద్ద సంస్థ మన దేశానికీ చెందిన టీసీఎస్ కావడం మనకి గర్వకారణం అన్నారు. అక్కడ టీసీఎస్ లో పని చేస్తున్న ఉద్యోగులలో తెలుగు వారు ఉన్నారని వారందరిని కలుసుకోవడం సంతోషాదాయకమన్నారు. మొత్తం మీద తమ పర్యటన విజయవంతం అయ్యిందని తెలియజేశారు. ఈ పర్యటనకు ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డికి, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి అలాగే ఈ కమిటీకి నేత్రుత్వం వహించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి తిరుపతి ఎంపీ గురుమూర్తి తన కృతజ్ఞతలు తెలియజేసారు.
Admin
Famous TV