Thursday, 30 July 2026 10:20:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక సీఎస్ఆర్ (CSR) టైమ్స్ గోల్డ్ అవార్డు 2024 ను అందుకున్న రాజన్న ఫౌండేషన్

Date : 27 August 2024 04:02 PM Views : 838

Famous TV - జాతీయ వార్తలు / : అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన CSR టైమ్స్ గోల్డ్ అవార్డు 2024 నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రముఖ సిఎస్ఆర్ టైమ్స్ సంస్థ ఈ అవార్డుని గోవా రాజ్ భవన్ లో జరిగిన 11వ నేషనల్ సిఎస్ఆర్ సమ్మిట్ కార్యక్రమంలో అందించింది. నైపుణ్యాలు మరియు జ్ఞానంతో వ్యక్తులకు సాధికారత కల్పించడంలో, మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డు నీ అందించి గౌరవించినది. రాజన్న ఫౌండేషన్ ద్వారా 2014 లో స్థాపించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 2000 నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ విభాగాలలో నైపుణ్యాభివృద్ధి చేయడమే కాకుండా వారికి అమర్ రాజా సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు తద్వారా ఆ నిరుద్యోగ యువత జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి, వారు స్వయం సమృద్ధిగా మారడానికి మరియు సమాజంలో గౌరవమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ "నైపుణ్యాభివృద్ధిలో మా ప్రయత్నాలను ధృవీకరించే ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది, మా కార్యక్రమాలు నైపుణ్యం అంతరాన్ని తగ్గించడం మరియు అందరికీ మరింత సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తును సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. CSR టైమ్స్ అవార్డ్ 2024 అనేది స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం" అని అన్నారు. ఈ అవార్డు కార్యక్రమం గోవా రాష్ట్ర రాజ్ భవన్‌ లోని దర్బార్ హాల్ జరిగింది. ఈ అవార్డు నీ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మరియు రాష్ట్ర పార్లమెంటు సభ్యుడు శ్రీ సదానంద్ చేతులమీదుగా రాజన్న ఫౌండేషన్ హెడ్ సతీష్ రాళ్ళపల్లి అందుకున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :