Thursday, 30 July 2026 10:00:04 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చందమామతో ఒక మాట చెప్పాలి...అందరి చూపు...భారత్ వైపు...

ఆర్బిటర్ లేకుండా లాండర్, రోవర్లతోనే చంద్రయాన్-3 ప్రయాణం...చంద్రయాన్ యాత్రకు కొన్ని మార్పులు

Date : 11 July 2023 06:56 PM Views : 538

Famous TV - జాతీయ వార్తలు / : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్-3 లో కొన్ని మార్పులు చేసింది.ఈనెల14న ఎల్విఎం-3 - ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికి రెండు జాబిల్లి యాత్రలు ముగిశాయి.అవి సాంకేతికంగా ఫెయిల్యూర్ అయినప్పటికీ పరిశోధనలో విజయం సాధించాయి.ఈసారి చంద్రయాన్-3 సాంకేతికంగా కూడా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చంద్రయాన్ ను రూపొందించారు.గతంలో జరిగిన జాబిల్లి యాత్రలను ఒక్కసారి పరిశీలిస్తే... 2008 అక్టోబర్ 22న పిఎస్ఎల్వి సి-11 రాకెట్ ద్వారా చంద్రయాన్-1 ప్రయోగించారు. 1380 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహం అదే ఏడాది నవంబర్ 14న చంద్రునిపై దిగి పరిశోధనలు చేయాల్సి ఉంది. అప్పట్లో ఈ ఉపగ్రహంలో ఆర్బిటర్ తో పాటు మూన్ ఇంపాక్ట్ ప్రోబోను అమర్చి పంపించారు.312 రోజుల తర్వాత చంద్రయాన్-1తో భూ కేంద్రాలకు సంబంధాలు తెగిపోయాయి.అయితే అప్పటి ప్రయోగం 95% సక్సెస్ అయినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఇక చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని 2019 జూలై 22న జిఎస్ఎల్వి -మార్క్3 రాకెట్ ద్వారా ప్రయోగించారు.అయితే వాస్తవానికి ఈ ప్రయోగం జూలై 14న జరపాల్సి ఉన్నప్పటికీ ఆఖరి క్షణంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఎట్టకేలకు జరిగిన ప్రయోగం పాక్షిక విజయాన్ని సాధించింది. చంద్రయాన్-2 లో 2379 కిలోల ఆర్బిటర్,1471 కిలోల లాండర్,27 కిలోల రోవర్లను ఉపయోగించారు.అయితే విక్రం పేరుతో నిర్మించిన లాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగక పోవడంతో అందులోని ప్రజ్ఞాన్ రోవర్ తో పాటు నిరుపయోగమైంది.ఆర్బిటర్ మాత్రం చాలా కాలం చంద్రుని చుట్టూ తిరిగి తన పరిశోధనలు అందించింది.అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు 98 శాతం ఈ ప్రయోగం విజయవంతమైనట్లు స్పష్టం చేశారు.ప్రస్తుతం చంద్ర యాన్-3 లో ఆర్బిటర్ ను ప్రవేశపెట్టలేదు.కేవలం లాండర్, రోవర్ లను ఈ ప్రయోగంలో చేర్చారు.3900 కిలోల బరువు ఉన్న లాండర్,రోవర్,ఇతర ఉపకరణాలను ఎల్విఎం3- ఎం4 భారీ రాకెట్ మోసుకెళ్ళనుంది.ఈ రాకెట్ ప్రయోగానికి 2023 జూలై 14న ముహూర్తం కుదిరింది.ఈ ప్రయోగాన్ని పూర్తిగా విజయవంతం చేసి అమెరికా, రష్యా,చైనాలకు ఏమాత్రం తాము తీసుపోమని ప్రపంచానికి ప్రకటించాలని ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.భారత ప్రభుత్వం 615 కోట్ల రూపాయలను ఇందుకోసం వెచ్చించింది. చంద్రుని దక్షిణ ద్రువం పై లాండర్,రోవర్ లు క్షేమంగా, అత్యంత భద్రంగా,సాఫ్ట్ లాండింగ్ అయితే ఒక మూన్ డే లో జాబిల్లిపై పరిశోధనలు చేసి ప్రపంచ అంతరిక్ష శాస్త్రవేత్తలకు అందించాల్సి ఉంది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: