Famous TV - జాతీయ వార్తలు / : భారతీయ సంస్కృతి, సంప్రదాయలు అత్యుత్తమమైనవి తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు అన్నారు. అగ్ర రాజ్యం అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా జరుగుతున్న 23వ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) మహా సభకు ప్రత్యేక ఆహ్వానం పై ముఖ్య అతిథిగా పులివర్తి నాని గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానా చేస్తున్న సేవలను ప్రశంశించారు. 2024 ఎన్నికల సమయంలో ఎన్ఆర్ఐ లు స్వగ్రామంలకు చేరుకుని తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలలో సాంస్కృతిక కార్యక్రమాలను తననెంతో ఆకట్టుకున్నాయని, అద్భుతంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని చెప్పారు. మన సంప్రదాయాలలోని శాస్త్రీయతను వివరించారు. ప్రపంచంలో తెలుగు వారు ఎవరు ఎక్కడ ఉన్నా ఒక్కటేనని, ఈ సభలకు ప్రతి సంవత్సరం హాజరవుతానన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. "ఎన్ ఆర్ ఐ"లు అందరికీ మహాసభల శుభాకాంక్షలు తెలిపారు.
Admin
Famous TV