Thursday, 30 July 2026 08:50:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ అవార్డును గెలుచుకున్న అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ

ఉద్యోగులందరికీ సానుకూలమైన పని వాతావరణాన్ని అందించడంలో సంస్థ యొక్క శ్రేష్ఠత ను 'గ్రేట్ ప్లేస్ టు వర్క్'

Date : 22 June 2024 05:34 PM Views : 817

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : తిరుపతి, జూన్ 22 : ఎనర్జీ & మొబిలిటీ రంగంలో సమగ్ర పరిష్కారాల ప్రదాత అయిన అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ (ఏఆర్ఈ & ఎం), 2024 సంవత్సరానికి గానూ పని చేయడానికి ఉత్తమమైన కంపెనీగా ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభించిందని సంతోషంగా ప్రకటించింది. 'ది గ్రేట్ ప్లేస్ టు వర్క్' ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలో పని చేయడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ కంపెనీల జాబితాలో (2024) కంపెనీ ఆకట్టుకునే రీతిలో 68 వ ర్యాంకింగ్‌ను సంస్థ సాధించింది. ఆటో మరియు ఆటో కాంపోనెంట్స్ పరిశ్రమలో అత్యుత్తమ వర్క్‌ప్లేస్‌ గా కూడా కంపెనీ నిలిచింది. 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (జిపిటిడబ్ల్యు) ఇన్‌స్టిట్యూట్ ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ప్లేస్ కల్చర్‌పై అథారిటీగా గుర్తింపు పొందింది. తమ ఉద్యోగులకు సానుకూల పని వాతావరణాన్ని అందించడంలో రాణిస్తున్న సంస్థలను ఈ విశిష్ట సంస్థ గుర్తిస్తుంది మరియు ప్రతి సంవత్సరం, అనేక కంపెనీలు ఈ సమగ్ర అధ్యయనంలో పాల్గొంటాయి. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీకి అందించబడిన సర్టిఫికేషన్ మరియు ర్యాంకింగ్ అనేది ఉద్యోగులను సర్వే చేయడం మరియు సంస్థ యొక్క పద్ధతులను అంచనా వేయడం వంటి కఠినమైన రెండు-దశల మూల్యాంకన ప్రక్రియ యొక్క ఫలితాల ఆధారంగా అందించటం జరిగింది. తమ విజయం వెనుక తమ ఉద్యోగులే చోదక శక్తి అనే నమ్మకంపై ఏఆర్ఈ&ఎం పునాది నిర్మించబడింది. సంస్థలోని ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సుకు భరోసా ఇస్తూ వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి తగిన శక్తినిచ్చే, వారికి సాధికారత కల్పించే మరియు స్ఫూర్తినిచ్చే సంస్కృతిని అందించడానికి కంపెనీ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుంటుంది. కంపెనీ అందుకున్న ఈ సర్టిఫికేషన్ మరియు ర్యాంకింగ్ తమ ఉద్యోగులు నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి అంతులేని అవకాశాలను సృష్టించేందుకు కంపెనీ చూపుతున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. "అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ వద్ద , మా వైవిధ్యమైన శ్రామిక శక్తి పరంగా అన్ని స్థాయిలలో వృద్ధి మరియు ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి ఉద్యోగి విలువైన వారుగా భావించటం తో పాటుగా , వారికి తగిన ప్రేరణ అందిస్తూ వారి శ్రేయస్సుకు మేము కృషి చేస్తున్నాము. ఇది 500,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 2,000 కంటే ఎక్కువ కంపెనీలతో పోటీ పడిన మా ఉద్యోగులు మరియు సంస్కృతికి నిజమైన నిదర్శనం. ఈ గౌరవప్రదమైన ర్యాంకింగ్ మరియు సర్టిఫికేషన్ మా ఉద్యోగులు మరియు మేము సేవ చేసే కమ్యూనిటీల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయడానికి చేస్తోన్న మా ప్రయత్నాలకు నిజమైన ధృవీకరణ" అని జైకృష్ణ బి, ప్రెసిడెంట్ - గ్రూప్ హెచ్ఆర్, అమర రాజా అన్నారు. ఏఆర్ఈ & ఎం ఈ అద్భుతమైన విజయం సాధించటం పట్ల గర్వంగా ఉంది, ఉద్యోగుల శ్రేయస్సు మరియు సంతృప్తిని నిరంతరం మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. తమ ప్రయత్నాలను గుర్తించి, తమకు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందించినందుకు 'ది గ్రేట్ ప్లేస్ టు వర్క్' ఇన్‌స్టిట్యూట్‌కి కంపెనీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని హర్షవర్థన్ గౌరినేని, డైరెక్టర్ అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ అన్నారు. ముంబైలో జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు నీ నరసింహులు నాయుడు సి  - చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, ఏఆర్ఈ & ఎం, రామమూర్తి ఆర్ - బిజినెస్ హెచ్‌ఆర్ హెడ్, ఏఆర్ఈ & ఎం, శేఖర్ జె - అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ - హెచ్ ఆర్ , మహేంద్ర కుమార్ రౌత్ - సీనియర్ జనరల్ మేనేజర్ - హెచ్ ఆర్, దిలీప్ కుమార్ ఎం  - బిజినెస్  హెచ్ ఆర్ మేనేజర్ , ఈశ్వర రావు బి  - అసిస్టెంట్  జనరల్ మేనేజర్ - హెచ్ ఆర్& అడ్మిన్, మరియు రేఖ డి  - డిప్యూటీ మేనేజర్ - ఓడి మరియు ఎల్ & డి వారు ఈ అవార్డు, సర్టిఫికేట్ ను అందుకున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: