Thursday, 30 July 2026 11:30:25 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఇస్రో బాహుబలి రెడీ.. చంద్రయాన్‌ -3కు సర్వం సిద్దం

Date : 13 July 2023 11:31 AM Views : 426

Famous TV - జాతీయ వార్తలు / : సూళ్లూరుపేట శ్రీహరికోట భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్‌ -3 ప్రయోగం అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని జాబిలమ్మా నీకోసం నేనొస్తున్నామా అంటూ ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35గంటలకు చంద్రుడివైపు అడుగులు వేయనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి బుధవారం ఎంఆర్‌ఆర్‌ సమావేశాన్ని శాస్త్రవేత్తలు నిర్వహించి రాకెట్‌ రిహార్సల్‌ వివరాలు నిశితంగా పరిశీలించి ప్రయోగానికి గ్రీన్‌సిగ్నెల్‌ ఇచ్చారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించి 24 గంటల పాటు నిర్విరామంగా కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు ఇస్రో బాహుబలిగా పిలువబడే ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ నారింజరంగు నిప్పులు చిమ్ముకుంటూ నింగికెక్కుపెట్టిన బాణంలా నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమికి సుమారు 3.84లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి వరకు మూడు అంచెల్లో ఈ ప్రయోగం సాగనుంది. ముందుగా ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ భూకక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరవేస్తుంది. భూమి చుట్టూ 24రోజుల పాటు తిరుగుతూ ఆ తర్వాత చంద్రుని దిశగా గమనం ప్రారంభించి 19 రోజుల పాటు పరిభ్రమిస్తూ ఉంటుంది. చంద్రునికి 30 కిలోమీటర్ల చేరువైన తర్వాత ఉపగ్రహం నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుని దక్షిణ ధృవంలో దిగనుంది. అయితే చంద్రయాన్‌ -2 ప్రయోగంలో ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంలో దిగే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి భూమి నుంచి సంకేతాలు తెగిపోవడంతో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొనడంతో ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రుని ఉపరితలంపై ఆశించిన పరిశోధనలు ఇస్రో చేయలేకపోయింది. ఈ వైఫల్యాన్ని నిషితంగా విశ్లేషించిన శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ సురక్షితంగా దిగే విధంగా సరికొత్త విధానాన్ని రూపొందించింది..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: