Friday, 12 June 2026 01:49:53 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మత్స్యకారుల నష్టాలు గుర్తిస్తున్నారా

పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

Date : 08 August 2023 07:43 PM Views : 517

Famous TV - జాతీయ వార్తలు / : గత మూడేళ్లలో మత్స్యకారులు సముద్ర చేపల వేట ద్వారా కలిగిన నష్టాలను కేంద్ర ప్రభుత్వం నమోదు చేసిందా, ఎక్కువ నష్టాలు సంభవించడానికి గల కారణాలు మరియు దానిని పరిష్కరించడానికి తీసుకున్న చర్యల ఏమిటి, దేశంలోని మత్స్యకారులు అధిక డీజిల్ ధరలతో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం గుర్తించిందా, అలా అయితే మత్స్యకార సంఘానికి డీజిల్ సబ్సిడీని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నద అలా అయితే దాని వివరాలు మరియు కాకపోతే దానికి గల కారణాలు తెలుపగలరు అంటూ పార్లమెంటులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మత్స్య శాఖా మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల సమాధానం ఇస్తూ మొదటి మూడు ప్రశ్నలకి సమాధానం లేదు అని చెబుతూ గత మూడు సంవత్సరాలలో సముద్రంలో చేపల వేట అనంతరం నష్టాలు సంభవించినట్లు మత్స్య మంత్రిత్వ శాఖకి ఎలాంటి నివేదికలు అందలేదని భారతదేశంలో అత్యధికంగా మత్స్యరంగంలో స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధి ద్వారా నీలి విప్లవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో “ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎస్.ఎస్.వై)” పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని తెలియజేసారు. ప్రధానంగా చేపల వేట అనంతర నష్టాలను తగ్గించడం, ఆధునీకరించడం మరియు పటిష్టం చేయడం లక్ష్యంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 వరకు 5 సంవత్సరాల కాలానికి ఫిషరీస్ రంగంలో ₹.20050 కోట్ల పెట్టుబడి పెట్టామని అన్నారు. మార్కెట్ల ఏర్పాటు మరియు మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, కోల్డ్ చైన్ స్టోరేజీ సౌకర్యాలు మరియు పంట కోత అనంతర రవాణా సౌకర్యాలు కల్పించడం. ఇంకా, ఫిషరీస్ రంగానికి మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి, ఫిషరీస్ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కూడా ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో రాయితీ ఫైనాన్స్ అందించడం కోసంగా రూ.7522.48 కోట్లతో రూపొందించిందని అన్నారు. దేశంలో డీజిల్ ధరలు 19.10.2014 నుండి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరను బట్టి నిర్ణయించబడతాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం తెసుకోందని అప్పటి నుండి, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు డీజిల్ ధరపై మార్కెట్ కి అనుగుణంగా నిర్ణయం తీసుకుంతున్నాయని చెబుతూ అదే సమయంలో, మత్స్యకారుల కోసం డీజిల్ ధరలను నియంత్రించడానికి సబ్సిడీ/పన్ను మినహాయింపులు లేదా రీయింబర్స్‌మెంట్‌లను అందించే వివిధ విధానాలు వివిధ తీరప్రాంత రాష్ట్రాలులలో ఉన్నాయని తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :