Thursday, 30 July 2026 08:57:26 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విమానాల మరమత్తు, నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన కెనెడా ఏవియేషన్ కంపెనీ

విమానాశ్రయంలో మౌళిక సదుపాయాల పరిశీలన, అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తితో భేటీ

Date : 28 September 2023 02:13 PM Views : 644

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమత్తు, నిర్వహణ చేపట్టేందుకు ఉద్దేశింపబడిన ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు కోసం గతంలో కేంద్ర విమానయాన శాఖా మంత్రితో పలుమార్లు సంప్రదింపులు జరిపిన విషయం విదితమే. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఇన్వెస్ట్ ఇండియా శిఖరాగ్ర సమావేశం వేదికగా ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు కోసం ఔత్సాహిక కంపెనీలను టెండర్లకు ఆహ్వానించడం జరిగింది. ఇదిలా ఉండగా ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కెనెడా ఏవియేషన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు తిరుపతి విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని సందర్శించారు. తదుపరి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో తిరుపతి లోని వారి కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పెద్ద నగరాలతో దీటుగా తిరుపతి నగరాన్ని మరియు తిరుపతి జిల్లాని అభివృద్ధి పథంలో నడిపేందుకుగాను రూపొందించబడిన ప్రణాళికలో భాగంగా తిరుపతి విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేసారు. ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ వారు వారి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారని రానున్న 6 నెలల సమయంలో ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఎంపీ గురుమూర్తి అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :