Friday, 31 July 2026 02:13:01 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బ్రెజిల్ పర్యటనలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

Date : 14 June 2023 10:22 PM Views : 486

Famous TV - జాతీయ వార్తలు / : వివిధ అంశాలపై అధ్యయనానికి కేంద్ర మంత్రి ఆధర్వంలో బ్రెజిల్ వెళ్లిన పార్లమెంటరీ కమిటీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి వివిధ అంశాలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా నియమిపబడ్డారు. ఈ కమిటీ ఆదర్వంలో ఆయన బ్రెజిల్ వెళ్లారు. ఒక కేంద్ర మంత్రి మరియు 9 మంది ఎంపీలతో కూడిన ఈ బృందం రెండు రోజుల క్రితం బ్రెజిల్ చేరుకొన్నారు. ఈ బృందానికి కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి నేతృత్వం వహిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అంశాలపై అధ్యయనం జరపనున్నారని తెలియవచ్చింది. ముఖ్యంగా ఇండియా బ్రెజిల్ మధ్య సంబంధాలను దృఢ పరచడం,ఆ దేశ పార్లమెంటరీ విధి విధానాలు వారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, వ్యవసాయంలో వారు అవలంబిస్తున్న అధునాతన పద్ధతులను ఈ బృందం అద్యయనం చేయనుందని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు. అలాగే మన రాష్ట్రానికి సంబందించిన ఒంగోలు జాతి గిత్తల ద్వారా ఆ దేశం వాళ్ళు రూపొందించిన సాంకేతికత ద్వారా మన దేశానికనే మెరుగైన మంచి పాల ఉత్పత్తి సాధించారని ఆ టెక్నాలజీపై కూడా ఈ పర్యటనలో అధ్యయనం చేయనున్నాం అని తెలియజేసారు. ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, బ్రెజిల్ వరుసగా భారతదేశం అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, బ్రెజిల్ 10 వ స్థానంలో ఉన్నాయి కానీ ఫర్ క్యాపిటల్ విషయంలో మన దేశ ఫర్ క్యాపిటల్ రెండు వేల డాలర్లుగా ఉండగా బ్రెజిల్ దేశ ఫర్ క్యాపిటల్ పది వేల డాలర్లుగా ఉందని ఈ అంశంపై కూడా తమ అధ్యయనం ఉండబోతుందని ఆయన తెలియజేసారు. ఈ అధ్యయన కమిటీ బ్రెజిల్ వెళ్లిన సందర్బంగా జరిగిన సమావేశంలో ఆ దేశ ముఖ్యులు అయినటువంటి సెనేటర్ నెల్సిన్హో ట్రేడ్, (బ్రెజిల్ సెనేట్లో బ్రెజిల్ ఇండియా పార్లమెంటరీ ఫ్రంట్ అధ్యక్షుడు) మిస్టర్ రోడ్రిగో పచేకో (బ్రెజిల్ సెనేట్ అధ్యక్షుడు) బ్రెజిలియన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మార్కోస్ పెరీరా మరియు ఫెడరల్ డిప్యూటీ మిస్టర్ వినిసియస్ కార్వాల్హో, ఇండియా-బ్రెజిల్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: