Thursday, 11 June 2026 10:57:42 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం

Date : 08 February 2026 07:39 PM Views : 745

Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం,దిగువపల్లి గ్రామపంచాయతీలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం,భక్తుల కోర్కెలు తీర్చే కల్పవళ్ళి బోయకొండ గంగమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఇటు ఆంద్రప్రదేశ్ అటు కర్ణాటక,తమిళనాడు లనుండి భక్తులు అధికంగా వచ్చారు,భక్తులు ఉదయం నుండి క్యూలైన్లలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు.ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉచిత ప్రసాదాల వద్ద తోపులాటలు లేకుండా అందరూ క్యూలైన్లో వెళ్ళి ప్రసాదాలు తీసుకొనే విధముగా సిబ్బందిని ఆదేశించారు,అమ్మవారి బలిపీఠము వద్ద జంతుబలులను,అక్కడ గల సౌకర్యాలను,అలాగే తలల వేలం పాటవద్ద గల భక్తులతో చర్చించి,వేలం పాట సవ్యంగా జరుగుతున్నదా లేదా అనేవిషయాలపై,సిబ్బంది భక్తులతో మాట్లాడుతున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు,కళ్యాణ కట్ట వద్ద భక్తులకు తలనీలాలు సమర్పించే భక్తులు టికెట్టు ద్వారానే తలనీలాలు సమర్పించాలనీ,ఎవరికీ అధనంగా పైకము చెల్లించవద్దని భక్తులకు తెలియజేశారు,కళ్యాణ కట్ట లో ఎవరైనాసిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కార్యాలయం దృష్టికి వస్తే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కళ్యాణ కట్ట సిబ్బందిని హెచ్చరించడం జరిగింది,అంతే కాకుండా అనునిత్యం సమాచార కేంద్రం నుండి ఆలయ ప్రాంగణం లో జేబుదొంగలున్నారని,తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులకు హెచ్చరికలు చేశారు,ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా,ఎవరైనా పిల్లలు తప్పిపోయినా పరిపాలనా కార్యాలయం ఎదురుగా గల సమాచార కేంద్రం లో సంప్రదించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆయన వెంట సూపరింటెండెంట్ రామనాథం,సుధాకర్ రెడ్డి,మణి తదితరులు ఉన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :