Famous TV - భక్తి / చిత్తూరు : మన రాష్ట్రములో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో కాణిపాకం శ్రీ వర సిద్ది వినాయక స్వామి దేవాలయము ఒకటిగా పేరొందిన విషయం మన అందరికి తెలిసిందే. రాష్ట్ర, దేశ, విదేశాలనుండి వేలాది మంది భక్తులు ప్రతి రోజు స్వామి వారి ని దర్శించుకొని తమ మొక్కులను తీర్చు కుంటున్నారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తి బావాలు పెంపొందించేలా ఆలయ పరిసరాలను ( సుమారు 500 ల మీటర్ల విస్తీర్ణంలో) తీర్చి దిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నదీ. ప్రస్తుతం ఈ ఆలయం నుండి అగరంపల్లి వద్ద గల ఆర్చి వరకు మరియు ఐరాల క్రాస్ వద్ద కొత్తగా నిర్మించిన ఆర్చి వద్ద వివిధ రాజకీయ నాయకుల బ్యానెర్లతో వ్యాపార ప్రకటనలతో నిండి ఉన్నది. దీనివలన భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఆ దారిలో వెలుతూ ఈ వింత పోకడలను చూసినప్పుడల్లా మనసుకు కష్టం కలుగుతున్నది. నేను చెంద్రగిరి MLA గా, మంత్రి గా ఉన్నప్పుడు ఈ ఆలయ పరిసరాలనుండి ఆర్చి ముందు వరకు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు గాని, రాజకీయ మరియు వ్యాపార బ్యానెర్లను ఉంచ రాదని తీర్మానం చేయించి అమలుచేయడం జరిగినది.ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడ ఈ నియమాన్ని పాటించడం జరిగింది. ఇందుకు ఆలయ ఉభయదారులు, వివిధ రాజకీయ పక్షాలు మరియు అన్ని వర్గాల ప్రజలు తమ పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది. తద్వారా భక్తులు భక్తి భావంతో గుడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఆనందంగా తిరిగి వెళ్లే వారు. గత కొన్ని సవత్సరములుగా తిరిగి ఆలయ పరిసర ప్రాంతాల పవిత్రత దెబ్బతినే విధంగా వివిధ రాజకీయ మరియు వ్యాపార బ్యానర్లతో నిండి ఉన్నది. ఇంత జరుగుతున్న ఆలయ అధికారులుగాని స్థానిక పోలీసులు గాని ప్రభుత్వ అధికారులుగాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. రాష్ట్ర, దేశ, విదేశాలనుండి వచ్చే భక్తుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది ఇందుకు గాను ఆలయ పరిసర ప్రాంతాలు భక్తి భావాలతో ఉట్టి పడేలా తీర్చిదిద్ద వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున కలెక్టరు గారు మరియు స్థానిక ఎంఎల్ఏ గారు సంబంధిత అధికారులకు తగు సూచనలు చేసి ఆలయ పరిసర ప్రాంతాలలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు మరియు బ్యానర్లకు చోటు ఇవ్వకుండా భక్తి పారవశ్యం పెంపొందించే విధంగా వెంటనే తగు చర్యలు తీసుకొనగలరని కోరుకుంటున్నాను, అని తెలియజేశారు.
Admin
Famous TV