Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. రెండు నెలలకు ఒకేసారి టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. మరోవైపు తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, వేసవి సెలవులు, పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో భక్తులు ఒక్కసారిగా తిరుమలకు క్యూ కట్టారు.తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
వేదాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు తెలియజేయడం కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదిక్ హెరిటేజ్ కారిడార్ ప్రారంభించడం అభినందనీయమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో వేదిక్ హెరిటేజ్ కారిడార్‌ను ప్రారంభించారు. వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతరిక్ష విజ్ఞానం, యాజమాన్య నిర్వహణ, గణితం, ఆరోగ్య సంరక్షణ, యోగ, ఆహారం తీసుకోవాల్సిన విధానం లాంటి దాదాపు 190 అంశాలను కూలంకషంగా వివరించాయన్నారు ఈవో. వీటి గురించి నేటి తరం వారికి తెలియజేసే ప్రయత్నం చేయడం సంతోషకరమన్నారు. వీటికి సంబంధించి అంశాలతో వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి రచించిన సం ఫాక్ట్స్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఎస్సేస్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే రెండు పుస్తకాలను ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు . వీటిని వేద విశ్వవిద్యాలయం ప్రచురించింది. మిగిలిన అంశాలపై కూడా పుస్తకాలు రచించి అందుబాటులోకి తేవాలని ఆయన వేదిక్ యూనివర్సిటీ విసిని కోరారు.
Admin
Famous TV