Friday, 31 July 2026 11:20:01 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులు కోర్కెలు ఎందుకు మరచిపోతారు?

దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోండి.

Date : 16 October 2024 04:02 PM Views : 991

Famous TV - భక్తి / తిరుమల స్పెషల్ : కలియుగ పురుషుడి ఆశ్రయం ఆనంద శరణాలయం. స్వామి వారిని కనులారా దర్శిస్తే చాలు చేసిన సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆనంద నిలయంలోకి వెళ్ళగానే కోరుకోవాల్సిన కోర్కెలు ఎందుకు మరచిపోతాం? శ్రీవారి ఆలయ మహిమలో ఇదో అద్భుతమని మీకు తెలుసా? అసలు ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? గోవిందా గోవిందా అని భక్తుల పలుకుకే శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సప్తగిరులు క్రిందకు దిగి భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు. అన్నమయ్య కీర్తనలకు పసిబాలుడై వటపత్రం మీద పవళించాడని పురాణాలు చెబుతున్నాయి. భక్త కౌశల్యుడు, అనంత కోటి భక్తులకు ముక్తి ప్రసాదించే ప్రసన్న భగవానుడు శ్రీ వేంకటేశ్వరుడు. భక్తుడు కోర్కెలు తీర్చి, వడ్డీకాసులను భక్తుల వద్ద ముడుపుల రూపంలో స్వీకరించే ఆనంద నిలయుడు ఆ లక్ష్మీ వల్లభుడు. వైకుంఠవాసుడు ఈ కలియుగంలో భక్తుల కోసం పాల కడలిని వీడి, సప్త గిరీషునిగా, వెంకటాచలంపై ఇల వైకుంఠాన్ని సృష్టించాడు.

Also Read : తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కలి ప్రభావం తగ్గాలన్నా, శనేశ్వరుని పీడితం నుంచి బయట పడాలన్న ఆ దేవదేవుని అనుగ్రహం కావాల్సిందే. స్వామి వారు కరుణ, చల్లని చూపు కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తిరుమలకు చేరుకొని క్షేత్ర సంప్రదాయం అనుసారం పుష్కరిణి స్నానం, వరాహ దర్శనం చేసుకుంటారు. అనంతరం ఆనంద విమాన గోపురంలో కొలువైన స్వామి వారిని దర్శిస్తాం. వెండి వాకిలి దాటి ఒక్కో అడుగు వేస్తుండగానే మనకు తెలియని ఏదో ఓ తెలియని నూతన అనుభూతికి లోనవుతున్నట్లు అనిపిస్తుంది.బంగారు వాకిలిలోకి ప్రవేశించి గంటా మండపంలోకి వెళ్ళగానే స్వామి వారి ధృవబేరం అయిన ఆ శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలుగగానే, కోరుకోవాలి అనుకొని కోర్కెలు మరచి కళ్ళార్పకుండా స్వామి వారినే చూస్తూ ఉండిపోతాం. దర్శనం అయినా వెంటనే క్యూలైన్లో పడిన కష్టం మరచిపోతాం. ఇక కోరుకోవాలి, స్వామివారి ముందు మన కోర్కెల దరఖాస్తు పెట్టాలని ఎన్ని అనుకున్నా ఆ నీలామయుడి దర్శనంతో కోర్కెలు కూడా మరిచిపోతాం. తిరుమలకు వచ్చే 100% భక్తులలో 99% మంది భక్తులకు ఇలాంటి అనుభూతే ఎదురవుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించామా?

శ్రీవారిని స్పృశించే అర్చకులకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసా? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా బంగారు వాకిలిలోకి చేరుకొని స్వామి వారిని తనివితీరా చూస్తారు. అదే సమయంలో మానసిక ప్రశాంతత ఏర్పడి, మనస్సు ఏకాగ్రం అయిపోతుంది. అదే సమయంలో కోర్కెలని మరచిపోయి స్వామి వారిని తదేకంగా చూస్తూ ఉండిపోతాం. జగన్మోహనకారాన్ని చూస్తూ బాహ్య ప్రపంచాన్ని మరచిపోతారు. ఇందుకు అనాదిగా ఒకేఒక కారణం చెబుతుంటారు వేదపండితులు.

HARI PRASAD

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :