Friday, 12 June 2026 01:41:12 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఎస్వీబీసీకి విశ్వవాప్త గుర్తింపు

రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు

Date : 07 July 2023 05:22 PM Views : 376

Famous TV - భక్తి / : నాలుగేళ్ల తమ ధర్మకర్తల మండలి హయాంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం శుక్రవారం తిరుపతిలోని ఛానల్‌ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి కూడా భయపడిన సమయంలో ఈవో శ్రీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా చక్కటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారని చెప్పారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు. తద్వారా ఛానల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని, ఎస్వీబీసీ యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ రేడియో కూడా భక్తుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. హిందీ, తమిళం, కన్నడ భాషలకు ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కూడా మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషితో ఛానల్‌ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. టీటీడీ సంస్థలతోపాటు సంస్కృత విశ్వవిద్యాలయంలోని పండితులు, ప్రవచనకర్తలు, మేధావులను అనుసంధానం చేసి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. జూలై 3వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీమద్‌ భాగవతం ప్రవచనానికి విశేషమైన స్పందన వస్తోందని, యూట్యూబ్‌తోపాటు ఛానల్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని చెప్పారు. భక్తితోపాటు సమాజంలో మంచిని పెంపొందించడానికి జరుగుతున్న కృషిని భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకుపోవడానికి ఛానల్‌ ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఉద్యోగులు భక్తిమార్గంలో ఛానల్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్‌ వార్షిక నివేదికను చదివి వినిపించారు. రాబోయే రోజుల్లో రూపొందించనున్న కార్యక్రమాలను వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు టీటీడీ ఛైర్మన్‌, ఈవో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డులు సభ్యులు శ్రీ నందకుమార్‌, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వసంత కవిత, సలహాదారు శ్రీ నాగదుర్గారావు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :