Thursday, 30 July 2026 10:39:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్ప - ఫోటో ప్రదర్శన

అపురూప చిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్

Date : 14 October 2023 08:10 PM Views : 621

Famous TV - భక్తి / తిరుపతి : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా టీటీడీ పుష్ప-ఫోటో ప్రదర్శనను ఆకర్షణీయంగా ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా, టీటీడీ గార్డెన్ విభాగం హిందూ పురాణాలలోని అపురూప ఘట్టాలతో పాటు ద్రౌపదీ వస్త్రాపహరణం, వసుదేవుడు చిన్ని కృష్ణుని కావేరి నది దాటిస్తున్న సన్నివేశం, గజేంద్రమోక్షం, బకాసురుడు, ఘటోత్కజుడు(మాయాబజార్), మహాభారతంలో అర్జునుడు బృహన్న వలె వేషధారణ పొంది ఉత్తర కుమాడితో ఉన్న సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచాయి.

గత దశాబ్ద కాలంగా విజయవాడకు చెందిన ప్రముఖ కళాకారులు శ్రీ కృష్ణ కూరగాయలు, ఐస్, నవ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైన వాటితో దేవతామూర్తుల ఆకృతులను చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా బెల్ పెప్పర్స్, వంకాయలు, ముల్లంగి, చెర్రీ టొమాటోలతో అలంకరించబడిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని రూపొందించారు. నవధాన్యాలలో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వారిని చిత్రించారు. కాగా, రావణుడు జటాయువును వధించడం, లవ-కుశ, శ్రీరామ జననం, మోహిని-భస్మాసుర, భీమసేన-బకాసుర, తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామితో పాటు అనంతాళ్వార్ సన్నివేశాలు భక్తులను విశేషంగా ఆకర్షించనున్నాయి.

టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్ లో ఈ ఏడాది అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు, వాహన సేవల సమయంలో యాత్రికుల భావోద్వేగాలు, టీటీడీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ప్రదర్శనలో ఉంచింది. అదేవిధంగా శేషాచల అడవులలో నెలకొని ఉన్న తిరుమల ఆలయ అద్భుత దృశ్యాలను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. టీటీడీ సాంప్రదాయ శిల్పకళాశాల వారిచే రాయి, సిమెంట్, స్టీల్, కలప మరియు పెయింటింగ్ లతో రూపొందించిన శిల్పాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇందులో ఉన్నాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప - ఫోటో ప్రదర్శన మరింత ఆధ్యాత్మిక శోభను ఇవ్వనున్నాయి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :