Famous TV - భక్తి / తిరుపతి : సనాతన ధర్మంను నాశనం చేయడానికి నాటి ‘గజని మహ్మద్, ఘోరీ మహ్మద్’ నుండి మొదలు పెడితే నేటి ’ఉదయనిది స్టాలిన్‘ వరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి..? ఎందుకు నాశనం చేయాలి..? మనిషి పుట్టుకతో ఏ జ్ఞానం లేని ఒక తెల్లకాగితం లాంటి వాడు. మనిషి ‘జీవితంలో నేర్చుకోవాలిసింది జ్ఞానం. పాటించాల్సింది ధర్మం!’ ఈ విషయం చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం..! ఈ ధర్మంకు ‘వేదం ప్రమాణం!’ వేదం అంటే జ్ఞానం (సైన్స్). వేదం ప్రకారం భగవంతుడిని ఆరాధించడానికి రెండే విధానాలు ఉన్నాయి… 1). బ్రహ్మ యజ్ఞం (సంధ్యా వందనం):- చీకటికి, వెలుగుకు మధ్య ఉన్న సంధి కాలంలో ‘గాయత్రి మంత్రం ద్వారా భగవంతుడిని ఆరాధించడం!’ 2). దేవ యజ్ఞం :- అగ్నిలో దేశవాళి ఆవు నెయ్యి వేసి వాతావరణమును శుద్ధి చేయడం. ఇక వేదంలో సమస్త శాస్త్రజ్ఞానం ఉంటుంది. మనిషి ఉభయ సంధ్యల్లో గాయత్రి మంత్రం చదివితే ఆరోగ్యంగా, నిజాయితీగా ఉంటాడు. కాబట్టి మనిషిని రోగాల పాలు చేయాలంటే, మనిషిని దుర్మార్గుడిగా మార్చాలంటే సనాతన ధర్మంను నాశనం చేయాల్సిందే! సనాతన ధర్మంలో చెప్పిన ‘యజ్ఞాలు చేయడం బద్దకించిన వారి కోసం.. మన ఋషులు.. దేవుడి ప్రతిమ ముందు మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి, కర్పూరంతో హారతిని ఇస్తూ ‘ఆరోగ్యంగా ఉండే విధానం వాడుకలోకి తెచ్చారు. దేవుడికి ‘తమలపాకులతో తాంబులం ఇచ్చి.. అవి తిని జీర్ణశక్తిని పెంచుకునే అలవాటు చేశారు! అలాగే సంవత్సరం మొత్తం ఏదో ఒక పండుగ రూపంలో ‘రావి, మర్రి, బిల్వ, తులసి, మామిడి లాంటి ఆకులను వాడే ఆరోగ్యకరమైన పద్ధతి కూడా అలవాటు’ చేశారు. ఇలా ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటే మెడికల్ మాఫియా వాళ్లకు చాలా నష్టం! అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి!
2019 లో వచ్చిన కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో శవాల గుట్టలు ఏర్పడుతుంటే.. సనాతన ధర్మ విధానాల వల్ల మన భారతదేశంలో మరణాలు లేక మెడికల్ మాఫియా వాళ్లు లాభాలు పొందలేక పోయారు! అందుకే సనాతన ధర్మంను నాశనం చేయాలి! వేదంకు ‘శిక్ష, వ్యాకరణం, చందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము’ అని 6 అంగాలు ఉంటాయి. గ్రహగతులను సరిగ్గా లెక్కగట్టే శాస్త్రం జ్యోతిష్యం. దీన్ని వాడుక లోకి తేవడానికి మన ఋషులు గ్రహగతుల వల్ల భవిష్యత్ కూడా చెప్పొచ్చు అని చెప్పారు. అందుకే వేదాంగాల్లో జ్యోతిష్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ జ్యోతిష్య శాస్త్రం వల్ల.. ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా గ్రహాగతులు, గ్రహణాల కాలాలు సరిగ్గా లెక్కగడుతున్నారు. ఇంత advanced టెక్నాలజీ ఉన్న ధర్మం కాబట్టి సనాతన ధర్మంను నాశనం చేయాలి. అందుకే జ్యోతిష్యం గురించి మీడియాలో, సినిమాలలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. వేదం నుండి ‘ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్య వేదం అని 4 ఉపవేదాలు’ మన ఋషులు రాసారు. ఇందులో మనిషి యొక్క రోగాలకు చికిత్స చేసే ఆయుర్వేదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Reporter
Famous TV