Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవీ న్యూస్ : చిత్తఃరు జిల్లా, చౌడేపల్లి: మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయ దినోత్సవాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కేశవ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులలో అభ్యసనా సామర్ధ్యాలను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్యా ప్రమాణాలలో మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని ఉపాధ్యాయులను కోరడం జరిగినది.ఎం.ఈ.ఓ 2 శ్రీమతి తిరుమలమ్మ మాట్లాడుతూ మండలంలో ప్రతి ఉపాధ్యాయులు చాలా చక్కగా పనిచేస్తూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేస్తూ అందరిని అభినందించడం జరిగినది. మండల యస్టీయూ అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి దేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ని ఆదర్శంగా తీసుకొని, ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలియజేయడం జరిగినది. యుటియఫ్ అధ్యక్షులు సహదేవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన ప్రతి పనిని సకాలంలో పూర్తిచేసి రిపోర్టులను మండలానికి, జిల్లాకు పంపి మన మండలం యొక్క ప్రతిష్టను పెంచాలని కోరడం జరిగినది.సి. పి. యస్ అధ్యక్షులు వసంత మాట్లాడుతూ మండలంలో మహిళా ఉపాధ్యాయులందరూ బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయాలని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయ సహకారాలు అందించి వారి విద్యభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఎం.ఈ.ఓ గా ఎన్నికైన తిరువల్లమ్మ ని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సురేష్ ని, మండల సీనియర్ ఉపాధ్యాయులు బి ఎన్ ప్రకాష్ ని, పుష్పలత ని, కృష్ణారెడ్డిని, మండల ఉపాధ్యాయుల తరఫున ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏవి సుబ్రహ్మణ్యం, సుధాకర్ నాయుడు, జగన్మోహన్ రెడ్డి, బాబు రమేష్, ఆంజనేయులు, మురళి, తులసి నాగరాజ, రామకృష్ణ, ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.
Admin
Famous TV