Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి, సెప్టెంబర్15: వైద్య రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టి చరిత్ర సృష్టించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు శుక్రవారం ఉదయం విజయ నగరం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి అక్కడ నుండి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల లో మరో నాలుగు కొత్త వైద్య కళాశాలలను వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రసంగించగా శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాల ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టర్, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంఎల్సి సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, తదితర అధికారులతో, వైద్య విద్యార్థులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 11 మెడికల్ కాలేజీ లు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్నాయని, ఈ ప్రభుత్వం వచ్చాక మరో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం జరిగిందనీ, అందులో నేడు 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, వచ్చే సంవత్సరం ఐదు వైద్య కళాశాలలను అడ్మిషన్ స్థాయికి తెస్తామని, ఆ మరుసటి సంవత్సరం మిగిలిన ఏడు వైద్య కళాశాలలను అడ్మిషన్ స్థాయికి తెస్తామని అన్నారు. గతంలో ఉన్న వైద్య కళాశాలల లో వైద్య సదుపాయాలు పెంచి, ఆధునిక టెక్నాలజీ అమలుతో నాడు నేడు కింద రూపు రేఖలు మార్చి ఆధునీకరణ చేయడం జరిగిందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ లోని దాదాపు అన్ని పోస్టులను భర్తీ చేయడం జరిగిందని అన్నారు. మంచి డాక్టర్లుగా కావాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశ్యంతో అనేక చర్యలు చేపట్టామని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభిస్తున్నామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నేడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం ఒక చరిత్ర అని, గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష గా ఉంటుందని, చాలా కష్టపడి చదివినా విద్యార్థులకు నాలుగు సంవత్సరాల ఎంబీబీఎస్ లో సీట్ పొందడం ఒక యుద్దమే, అలాగే పీజీ సీటు రావడం కూడా ఒక గట్టి పోరాటమే అని గత ఐదు సంవత్సరాల ముందు మీరు ప్రభుత్వం ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. ఆరోగ్యశ్రీ మొదలుకొని నేడు ప్రారంభించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష వరకు అనేక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఐశ్వర్య అనే పీజీ విద్యార్థిని గైనకాలజీ విభాగం నుండి మాట్లాడుతూ తాను కేరళ నుండి వచ్చి ఎస్వీ మెడికల్ కాలేజీలో చదువుతున్నానని నేటి సిఎం గారి తండ్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు గుల్బర్గాలో మెడికల్ గ్రాడ్యుయేషన్ అభ్యసించి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఇంటర్న్ షిప్ చేశారని, ఈ కళాశాలలో మేము కూడా చదువుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, వారి తనయుడైన మీరు మరింత గొప్పగా వైద్య ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా మార్చిన ఘనత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిదే అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ మొదలుకొని అనేక కార్యక్రమాలు చేపట్టాలని కొనియాడారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలలో ఆధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించి అందుబాటులోకి తెచ్చి గ్రామీణ, గిరిజన పేద ప్రజలకు కూడా వైద్యం అందుబాటులో తెచ్చారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్లకు భద్రతాభావ వాతావరణం కల్పించినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు లేకుండా అన్ని పోస్టులు భర్తీ చేయడం వలన వైద్య కళాశాలలో యూజీ పీజీలకు బోధనలో ఎంతో ఉపయోగకరంగా ఉందని, విలేజ్ హెల్త్ క్లినిక్ లు పీహెచ్సీల ఏర్పాటుతో వైద్యాధికారుల వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వీలు కల్పించి, ఆత్మ సంతృప్తిని కలిగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య శ్రీ, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా సకాలంలో గర్భిణీ స్త్రీలను ఆసుపత్రుల్లో చేర్చి ఇన్స్టిట్యూషనల్ ప్రసవం జరిగేలా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షించి మాతా శిశు మరణాలు అరికట్టడం ఎంతో హర్షించదగ్గ పరిణామం అని తెలిపారు. రోగులు చావు బతుకుల్లో ఉన్నప్పుడు డాక్టర్ సేవలను గుర్తించి వారిని దేవుడుగా భావిస్తారని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేసిన మీరు నిజమైన దేవుడుగా భావిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తాను పనిచేస్తానని తెలిపారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ నేటి నుండి ప్రారంభ నేపథ్యంలో బ్యానర్ ను కలెక్టర్ టీటీడీ చైర్మన్, ఎంఏల్సి మేయర్ లతో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డి ఎం హెచ్ ఓ శ్రీహరి, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
Famous TV