Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో జిల్లా సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబలైజింగ్ ఆఫీసర్ మధుసూదన్ నాయుడు మోడల్ ప్రైమరీ పాఠశాల, చౌడేపల్లి ను మరియు డి. రాజులూరు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా పిల్లల యొక్క అభ్యసన సామర్ధ్యాలను, ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్ష పేపర్స్, బుక్ లెట్స్ కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా చౌడేపల్లి మండల విద్యాశాఖ కార్యాలయంలో డ్రాఫ్ట్ బాక్స్, స్కూల్ సేఫ్టీ ఆడిటింగ్ ,సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ వివరాలను, బయోమెట్రిక్ అతంటికేషన్ వివరాలను పరిశీలించడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలో మండల విద్యాశాఖ అధికారిణి తిరుమల మ్మ, వసంత, నరేష్,సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
Famous TV