Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చిత్తూరు, పూతలపట్టు మండలం, పేటమిట్ట , మంగళ్ విద్యాలయంలో ఎన్‌సిసి ప్రారంభోత్సవం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమర రాజ సంస్థల వ్యవస్తాపకులు డా. గల్లా రామచంద్ర నాయుడు గారు, ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ కొల్నెల్ యోగేశ్ దుంగ్రకోటి గారు, కొల్నెల్ అజయ్ బస్నెట్ గారు హాజరయ్యారు. మొదటి బ్యాచ్ గా 100 మంది విద్యార్తులు శిక్షణను పొందనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన డా. గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ మంగళ్ విద్యాలయంలో ఎన్‌సిసి ప్రారంభించడం చాలా సంతోసించదగిన విషయం. ఎన్‌సిసి విద్యార్థుల మనోవికశానికి,శారీరక పటుత్వానికి ఎంతగానో తోడ్పడుతుందని ,ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ కొల్నెల్ యోగేశ్ దుంగ్రకోటి గారు మాట్లాడుతూ మంగళ్ విద్యాలయంలో ఎన్‌సిసి ప్రారంభించడం చాలా సంతోసించ దగిన విషయం అన్నారు. విద్యార్థుల క్రమ శిక్షణకు ఎన్‌సిసి దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమం లో రాజన్న ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్. సతీష్, ప్రిన్సిపల్ ధనంజయ నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్‌సిసి అధికారులు పాల్గొన్నారు.
Admin
Famous TV