Friday, 12 June 2026 01:42:02 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఉజ్వల భవిష్యత్తు ఉత్పాదకరంగం ద్వారా సాధ్యమే

ఆచార్య జి.రంగజనార్ధన , ఉపకులపతి, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం

Date : 26 June 2023 07:14 PM Views : 441

Famous TV - విద్య ఉద్యోగాలు / అనంతపురం : అనంతపురం .స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవ వేడుకకు అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. రంగజనార్ధన ముఖ్య అతిథిగా విచ్చేశారు.వారు తన స్నాతకోపన్యాసంలో ముందుగా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులను అభినందిస్తూ వారికి దిశ నిర్దేశం చేశారు.దేశ భవిష్యత్తు ఆర్థిక రంగంపై ఉంది యువత కేవలం సేవారంగంపై మొగ్గుచూపుక ఉత్పాదక రంగం వైపు అడుగులు వేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు . చిన్న దేశాలైన తైవాన్ దక్షిణ కొరియా వంటివి ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి అంటే ఆయా దేశాలు ఉత్పాదకరంగంలో సాధించిన అభివృద్ధే కారణం అని ఆయన అన్నారు. అనంతరం కళాశాల వ్యవస్థాపకులు శ్రీ జి.పుల్లయ్య గారు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని తమ కళాశాల పెద్ద పెద్ద నగరంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు ధీటుగా ప్లేస్మెంట్స్ సాధిస్తూ విద్యార్థులకు ,తల్లిదండ్రులకు గట్టి భరోసా ఇస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన వైపు దృష్టి పెట్టినట్లయితే ఆ విద్యార్థి లేదా విద్యార్థిని జీవితంలో రాణిస్తారన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి మనదేశంలో కూడా రావాలని అభిలాషించారు .రానున్న రోజుల్లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని దీనికి మూల కారణం యువభారతమే అని అన్నారు . పట్టభద్రులైన ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు గర్వపడేలా, జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు .దేశం గుర్తించేలా ప్రవర్తించాలని సూచించారు .ఈ సందర్భంగా బ్రాంచీల వారిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథి బంగారు పథకాలను ప్రధానం చేశారు .అనంతరం కళాశాల చైర్మన్ శ్రీ జి.వి.యం. మోహన్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 489 మంది విద్యార్థినీ విద్యార్థులుగ్రాడ్యుయేషన్ పట్టాలు పుచ్చుకుంటున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వై. పాండురంగయ్య,అడ్మన్ డీన్ డాక్టర్ ఎం. గిరిధర్ కుమార్ ,డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :