Famous TV - సామాజిక సేవ / తిరుపతి : తిరుపతి సబ్ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ( జెసిఐ) ఆధ్వర్యంలో కార్డియో-పల్మనరీ రిససిటేషన్( సి పి ఆర్ )పై శిక్షణ ఇచ్చారు. దీనిపై ట్రైనర్ డాక్టర్ రత్న శేఖర్ అందరికి అవగాహన కల్పించారు.గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వ్యక్తి మెదడుకు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగ పడుతుందని చెప్పారు. అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక చికిత్స చేసి వైద్య సేవలు అందిస్తే ప్రాణం కాపాడ వచ్చని వివరించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గురు శేఖర్, జె ఏసి జోన్ వైస్ చైర్మన్ శంకర్, జె సి ఐ తిరుపతి చాప్టర్ అధ్యక్షుడు శేష సాయి, వై ఎస్ బాబు, గుణశేఖర్, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Famous TV