Famous TV - సామాజిక సేవ / తిరుపతి : బుధవారము ఎస్వీ వైద్య కళాశాల రుయా ఆసుపత్రి లో కె . శివయ్య చికిత్స పొందుతూ మరణించారు చనిపోయిన కె . శివయ్య సుమారు 44 సంవత్సరాలు , రాయచోటి గ్రామము, కడప ప్రాంతానికి చెందిన వ్యక్తి. రుయా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయన భార్య తన భర్త నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది. రుయా కంటి విభాగము విభాగాధిపతి డా చలపతి రెడ్డి అధ్వర్యంలో నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది. నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి భార్య కె రత్నమ్మ, సమ్మతితో ఆయన నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ ఎస్ .రమేష్, నేత్రాలను సేకరించి, నేత్ర బ్యాంకులో భద్రపరచడం జరిగినది. నేటి యువత తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు , ముందుకు రావడం జరుగుతున్నది, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలను సేకరించడం జరుగుతున్నది, అని నేత్ర విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు , మాట్లాడుతూ యువత వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా ప్రభుత్వ వైద్యశాలలకు నేత్రాలు, అవయవాలు దానం చేయడం వలన పేద రోగులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి ఉచితముగా అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రింది ఫోను నెంబర్ కు సంప్రదించవచ్చును, సెల్ నెంబర్: 8500880126, ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఎస్ .రమేష్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV