Famous TV - సామాజిక సేవ / తిరుపతి : తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కలాం ట్రస్ట్ ఏడో వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి శ్రీ భవాని కుమార్ గారు, ఇస్రో సైంటిస్ట్ జడ్జిగా వ్యవహరించారు. అదేవిధంగా ఈ ఏడవ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవకులను గుర్తించి రాష్ట్రస్థాయి సేవా పురస్కారాలను కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ కేవీ లక్ష్మణ్ గారు OSD,ISRO బెంగళూరు, శ్రీ పి ఎస్ కరుణానిధి గారు ఇంటర్నేషనల్ డైరీ సైంటిస్ట్ , శ్రీ సోము రవికుమార్ గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ , శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి గారు ,ఎండి డాలర్ గ్రూప్స్, శ్రీ బి హర్షవర్ధన్ రెడ్డి గారు జె సి ఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ డాక్టర్ శ్రీవాత్సవ్ గారు ఎండి మైండ్రానిక్స్ , శ్రీ ప్రొఫెసర్ కృష్ణయ్య గారు హెచ్ ఓ డి ఫిజికల్ సైన్స్ మహిళా యూనివర్సిటీ, డాక్టర్ ఎస్.హసీనా గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ,అపోలో యూనివర్సిటీ మరియు డాక్టర్ విజయకుమార్ గారు మెజీషియన్ అతిథులుగా హాజరై స్వచ్ఛంద సేవకులను మరియు సైన్స్ ఎక్స్పోలో పాల్గొన్న విద్యార్థులకు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు కలం ట్రస్ట్ జ్ఞాపికలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విశిష్ఠ అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలోని ప్రతి యువత కూడా అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి దేశానికి మంచి పేరు తీసుకొచ్చాలా అభివృద్ధి కార్యక్రమాలను మానవత దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలాం ట్రస్ట్ ప్రతినిధులు మరియు వాలంటీర్లు పాల్గొనడం జరిగింది.
Admin
Famous TV