Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం నందివర్గం ప్రాథమిక పాఠశాల యందు శ్రీ జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాలలోని 96 మంది విద్యార్థులకు వివిధ రకాల జ్ఞాన దాయకమైన పుస్తకాల పంపిణీ మరియు ప్లాస్టిక్ వాడటం వలన కలుగు నష్టాలు పర్యావరణం వల్ల కలుగు లాభాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల మానవులకే కాక సమస్త జీవకోటి కూడా నష్టం కలుగుతుందని తెలిపారు భారతదేశ జనాభా 140 కోట్ల అయితే సగటున ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడడం వల్ల ఆరోగ్యానికే కాకుండా దాని వ్యర్ధాల వలన జంతువులకు పక్షులకు కూడా నష్టం కలుగుతుందని వివరించారు పర్యావరణంగా వలన కలుగు లాభాలను తెలిపారు ప్రతి ఒక్కరూ పది మొక్కలైన నాటి సంరక్షించాలని కోరారు పాఠశాల హెచ్ఎం రమణ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన దాయకమైన పుస్తకాలు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రవణ ఉపాధ్యాయుడు మద్దిలేటి ఎస్సీ సంఘం నాయకులు సంటన్న రాజు ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలను బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు
Admin
Famous TV