Famous TV - తెలంగాణ / : హైదరాబాద్:డిసెంబర్26 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ఉదయం కలిశారు. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన మెగాస్టార్ కొత్త సీఎంకు చిరు పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మెగాస్టార్ వివరించారు. కొత్త ప్రభుత్వానికి టాలీవుడ్ సహకారం సంపూర్ణంగా ఉంటుందని రేవంత్ రెడ్డికి చెప్పారు.త్వరలోనే టాలీవుడ్ పెద్దలతో కలసి వస్తామని, ఆ సందర్భంగా మరిన్ని సమస్యలను మీ దృష్టికి తెస్తామని వివరించారు.ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో మరింత అభివృద్ది చెందేందుకు తమ వంత సాయం అందిస్తామని, ఏ సమస్య వచ్చినా తనను నేరుగానే కలువవచ్చని రేవంత్ మెగాస్టార్ తో అన్నారు
Admin
Famous TV