Thursday, 30 July 2026 07:18:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సీఎం గా రేవంత్ తొలిసంతకం ఆ ఫైల్ మీదే

Date : 06 December 2023 10:15 AM Views : 661

Famous TV - తెలంగాణ / : తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపారు తెలంగాణ ప్రజలు. హస్తం పార్టీకి అవకాశం కల్పించారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ అయితే గెలిచింది కానీ.. సీఎం ఎవరు అని తేల్చడానికి ముందు హైకమాండ్‌కు రెండు రోజులు పట్టింది. అనేక చర్చోపచర్చల తర్వాత... తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని తేల్చింది. తీవ్ర ఉత్కంఠ కొనసాగిన చివరకు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండు అంటే డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉంటే సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టగానే.. తాను ఏ ఫైల్ పై సంతకం చేస్తారో ముందుగానే చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీనిపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. సోనియాగాంధీ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలపైనే ఆయన తొలి సంతకం పెడతానని గతంలో చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించిన తర్వాత రోజు నుంచి కేసీఆర్ కనిపించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలను చూసిన కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని చెప్పారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ పనిచేస్తారో లేదో చూడాలి. కాంగ్రెస అధికారంలోకి వస్తే తమకు గ్యాస్ సిలిండర్ రూ.500కే వస్తుందనిమహిళలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రేవంత సీఎంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడంపై రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 7న ఆయన ప్రమాణ స్వీకారం జరగనుంది, అయితే సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను వ్యక్తిగతంగా కలిసి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :