Friday, 12 June 2026 12:22:49 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

జర్నలిస్ట్ అవ్వాలని ఐపిఎస్ అయ్యాను, జర్నలిస్టులు ఫిట్నెస్ పై దృష్టి సారించండి - డిఐజి ఆవుల రమేష్ రెడ్డి

క్రికెట్ విజేత రాయలసీమ లయన్స్

Date : 12 June 2023 04:46 PM Views : 360

Famous TV - క్రీడలు / తిరుపతి : రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ లో జర్నలిజం నాలుగో స్తంభంగా నిలిచిందని, తాను పవిత్రమైన జర్నలిస్టు కావాలనుకుని ఐపీఎస్ ను అయ్యానని డి ఐ జి ఆవుల రమేష్ రెడ్డి పేర్కొన్నారు . జర్నలిస్టు కాలేకపోయానన్న లోటు తనలో మిగిలిపోయిందని, అందుకే వారితో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాల క్రీడా మైదానాల్లో ఆదివారం జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి జోనల్స్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. 13 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడా జర్నలిస్టులు ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. టోర్నీ ఫైనల్స్ లో కృష్ణ గోదావరి ఫైటర్స్ తో రాయలసీమ లయన్స్ జట్టు తలపడి విజేతగా నిలిచింది. తిరుపతి వేదికగా నిర్వహించిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి జోనల్స్ క్రికెట్ టోర్నీ లో రాయలసీమ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది‌. బహుమతుల ప్రధానోత్సవాలకు ముఖ్య అతిథులుగా డిఐజి ఆవుల రమేష్ రెడ్డి ,తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, రమాదేవి ఆసుపత్రి అధినేత డాక్టర్ డిబి శశిధర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్ర లు విచ్చేసి విజేతలకు బహుమతులను అందించారు. ఉదయం క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్ వి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రాజారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, ఎస్వీయూ పిడి ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి లంచనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అతిధులందరూ కొంతసేపు బ్యాటింగ్, బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఐజి ఆవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం పని భక్తుడులో ఉండే జర్నలిస్టులు ఫిట్నెస్ పై దృష్టి సారించాలన్నారు. ఉత్తమ జర్నలిస్టులుగా రాణించాలంటే మానసిక, శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్నారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంటుకు 13 జిల్లాల నుంచి జర్నలిస్టులంతా ఒకే వేద పైకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డిఎంహెచ్వో డాక్టర్ శ్రీహరి, డాక్టర్ శశిధర్ రెడ్డి లు మాట్లాడుతూ జర్నలిస్టులు ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదాన్ని ఎవరు విస్మరించవద్దని సూచించారు. జర్నలిస్టులంతా తరచూ ఇలా క్రీడల్లో కలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణంరాజు కార్యదర్శి ఎం శివశంకర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పులిగోరు శ్రీనివాసులు నెల్లూరు శ్రీనివాసులు ట్రెజరర్ సుబ్రహ్మణ్యం మేనేజర్ విజయ్ తో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, క్రీడ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :