Thursday, 30 July 2026 10:35:19 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

క్రీడల్లో రాణించేందుకు అంధత్వం అడ్డుకాదు!

- జెసిఐ అంతర్జాతీయ కమిషన్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి

Date : 07 July 2025 10:27 PM Views : 647

Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతి, జులై 7: క్రీడల్లో రాణించేందుకు అంధత్వం అడ్డుకాదని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ - ఇండియా అంతర్జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తుమ్మలగుంట కెవిఎస్ పార్క్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీల ప్రారంభం సందర్భంగా ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు అయిన ఆయన మాట్లాడుతూ అంధులు అనేక రంగాలతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఏపీ డేవిడ్ జాన్, భారత జాతీయ అంధ క్రికెట్ జట్టు కెప్టెన్ అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధులు అన్ని విధాలా సమర్థులని తెలిపారు. సరైన మార్గదర్శనం, శిక్షణ, అవసరమైన వనరులు అందితే వారు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణి స్తారని చెప్పారు. క్రీడలు శక్తిని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. ఈ కారణంగా అంధులకు ప్రత్యేక క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్ర నుండి ఆరు జిల్లాల జట్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్లేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి శాఖ చైర్మన్ శేష సాయి, గట్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, దివ్యంగ సేవా క్షేత్రం ప్రెసిడెంట్ ముని లక్ష్మి క్రీడాకారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: