Famous TV - సినిమా / : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ కానుంది.. తాజాగా ఈ చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అన్ని థియేటర్స్‌లోనూ ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే పది రోజుల వరకు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇకపోతే అటు తెలంగాణ సర్కార్ కూడా టికెట్ రేట్ల పెంపుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే! మొదటి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.50 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది
Admin
Famous TV